ట్రంప్ తీపి కబురు: మెరిట్ ఆధారంగా గ్రీన్ కార్డులు, ఇండియన్లకు లాభమే
వాషింగ్టన్: ప్రతిభ ఆధారంగానే ప్రవేశం కల్పించాలని ట్రంప్ ప్రకటన చేశారు. అమెరికాను ప్రథమ స్థానంలో ఉంచేందుకు ఇదే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. లాటరీ వీసా వ్యవస్థకు తాను ముగింపు పలకబోతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అమెరికాలో నిరుద్యోగం 45 ఏళ్ళ కనిష్ట స్థాయికి పడిపోయిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. దేశాబివృద్ది కోసమే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ట్రంప్ సూచించారు.అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారిగా ట్రంప్ బుధవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సమావేశానికి ఇండియాకు చెందిన టెక్కీ కూచిబొట్ల శ్రీనివాస్ సతీమణి సునయన కూడ హజరైంది. గత ఏడాది కేన్సన్ రాష్ట్రంలో జరిగిన జాతి విద్వేష కాల్పుల్లో కూచిబొట్ల శ్రీనివాస్ మరణించాడు. డెమొక్రాట్ సభ్యులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగాన్ని బహిష్కరించారు.
ఈ సమావేశానికి వారంతా గైరాజరయ్యారు.ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్లు గర్వపడేలా దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లనున్నట్టు ట్రంప్ చెప్పారు. సురక్షిత, పటిష్ట అమెరికా లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తాలిబన్లతో చర్చల ప్రసక్తే లేదని ట్రంప్కొట్టిపారేశారు.

ప్రతిభ ఆధారంగానే గ్రీన్ కార్డులు
ప్రతిభ ఆధారంగానే గ్రీన్ కార్డులు ఇవ్వనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండేందుకు ఇదే సరైన మార్గమని తాము భావిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు.మెరిట్ ఆధారిత వలస విధానం ప్రారంభించేందకు ఇదే సరైన సమయమన్నారు.

గ్రీన్‌కార్డులు ఎవరికీ దక్కుతాయంటే
మెరిట్ ఆధారిత వలస విధానం ప్రారంభించడానికి ఇదే సమయం. ఎవరైతే అధిక నైపుణ్యాలు కలిగి ఉన్నారో, ఎవరు మన సమాజానికి మంచి సేవలను అందించగలరో, ఎవరు మన దేశాన్ని ప్రేమించి గౌరవిస్తారో వారికి మాత్రమే మనం గ్రీన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పారు.

మెరిట్ ఆధారిత వీసాలతో ఇండియన్లకు లాభం
మెరిట్ ఆధారితి వీసాలతో ఇండియన్లకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాటరీ విధానామో, మరో విధానం వల్ల కొంత ఇబ్బందులు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మెరిట్ ప్రకారంగా వీసాల వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఈ విధానం వల్ల ఇండియన్ టెక్కీలకు లాభమే ఉంటుందని ఆయన చెప్పారు.

కుటుంబ విస్తరణను అడ్డుకొనే హక్కుంది
మెరిట్ ఆధారిత వలస వ్యవస్థను ట్రంప్ తీసుకొస్తే అది ఎక్కువమంది భారతీయులకు మేలును అందిస్తుంది. అయితే, వారి కుటుంబాలను విస్తరించుకునేందుకు మాత్రం అడ్డుకునే అవకాశం ట్రంప్ ప్రకటించిన విధానంలో ఉండనుంది. తాజాగా ట్రంప్ ప్రకటించిన విధానం భారతీయులు ఊపిరి పీల్చుకొంటున్నారు.












Click it and Unblock the Notifications