ట్రంప్ గెలిస్తే అధోగతే: అమెరికన్లకు ఒబామా హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను గెలిపించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా తన శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా ఇప్పటినే చాలా ర్యాలీలు నిర్వహించారు. సోమవారం మిచిగాన్‌లో జరిగిన ర్యాలీలోనూ ఒబామా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికన్లకు పలు హెచ్చరికలు చేశారు.
హిల్లరీ క్లింటన్ గెలవకపోతే అమెరికాలో అభివృద్ధి అట్టడుగు స్థాయికి చేరుతుందని ప్రజలను హెచ్చరించారు. ఆమె అధ్యక్ష పదవి చేపట్టకపోతే గత ఎనిమిదేళ్లలో తన పాలనలో సాధించిన అభివృద్ధి కూడా పూర్తిగా నాశనమైపోతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. హిల్లరీకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తనకు ఇప్పటివరకు మద్దతిచ్చిన విధంగానే హిల్లరీకి మద్దతివ్వాలని ప్రజలను అభ్యర్థించారు.

చిగాన్‌లో అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజాలు ఫోర్డ్, జనరల్ మోటార్స్ 2008లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తర్వాత ఒబామా పాలనలోని పాలసీలతో తిరిగి ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో హిల్లరీ ప్రచార బృందం ఒబామాను మిచిగాన్‌కు పంపించి ప్రచార కార్యక్రమం నిర్వహించింది.
ఉద్యోగాల కోల్పోయే పరిస్థితి నుంచి 15.5 మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించామని ఈ సందర్భంగా ఒబామా గుర్తుచేశారు. మిచిగాన్‌లో నిరుద్యోగ రేటును తగ్గించామన్నారు. అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం అమెరికాలో పోలింగ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఫలితాలు వెలువడతాయి. ప్రస్తుత పోల్ సర్వేలన్నీ హిల్లరీనే ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంటున్నాయి. కాగా, బుధవారం మధ్యాహ్నం వరకు పూర్తి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications