• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నన్ను ఓడించేందుకు చైనా కుట్ర చేస్తోంది: డ్రాగన్ కంట్రీపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

|

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్దం గత కొంతకాలంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనావైరస్ చైనాలోని వూహాన్‌ నగరంలో వెలుగు చూశాకా అగ్రరాజ్యం అమెరికా చైనాపై ఒంటికాలుతో లేచింది. ప్రపంచదేశాలను కబళిస్తోన్న కరోనావైరస్‌కు కారణం చైనానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు.

కిమ్ ఆరోగ్యంపై ట్రంప్ ప్రకటన...ఆ రోజు నుంచి నియంత అదృశ్యం..సౌత్ కొరియా వాదన మరోలా..!

 ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

చైనా పై అగ్రరాజ్యపు అధినేత మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తనను ఓడించేందుకు చైనా ఎంతకైనా దిగజారుతుందనే వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. కరోనావైరస్‌కు కారణం చైనానే అని మరోసారి చెప్పిన ట్రంప్ డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు. తాను తలచుకుంటే చాలా చేయగలనని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో 60వేల మంది మృతికి కారణం చైనానే అని ట్రంప్ ఆరోపణలు చేశారు. అంతేకాదు ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి కూడా కారణం చైనానే అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

 జోబిడెన్‌ గెలవాలని చైనా కోరుకుంటోంది

జోబిడెన్‌ గెలవాలని చైనా కోరుకుంటోంది

కరోనావైరస్ గురించి బయటపడగానే ప్రపంచ దేశాలను చైనా అలర్ట్ చేసి ఉండాల్సిందని అలా చేయలేదని మండిపడ్డారు ట్రంప్. తనను ఓడించేందుకు చైనా ఎంత దూరమైన వెళుతుందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష పీటంపై డెమొక్రాటిక్ అభ్యర్థి జోబిడెన్‌ను చైనా చూడాలని భావిస్తోందని ట్రంప్ అన్నారు. ఇలా చేస్తే వాణిజ్య పరంగా తాను తీసుకొచ్చిన ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందనే యోచనలో చైనా ఉందని అన్నారు ట్రంప్. ఇక తమకేమీ తెలియదన్నట్లుగా చైనా అమాయకపు డ్రామాలు ఆడుతోందని విరుచుకుపడ్డారు.

 కరోనావైరస్ పాలనకు రెఫరెండం కాదు

కరోనావైరస్ పాలనకు రెఫరెండం కాదు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం సాధిస్తారంటూ జోస్యం చెబుతున్న ఒపీనియన్ పోల్స్‌ను తాను నమ్మబోనని స్పష్టం చేశారు ట్రంప్. తన పాలనకు కరోనావైరస్ రెఫరెండంగా తీసుకోకూడదని చెప్పారు. అమెరికా ప్రజలు చాలా తెలివైన వారని అసమర్థుడిని అధ్యక్ష పీటం పై కూర్చోబెట్టరనే తాను అనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. చైనా అమెరికాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగిన వాణిజ్య యుద్ధంకు ముగింపు పలికే దిశగా చర్యలు తీసుకున్నామని అయితే చైనా నుంచి వచ్చిన కరోనావైరస్‌తో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందని వెల్లడించారు. అమెరికాకు ఘనమైన ఆర్థిక వ్యవస్థగా చరిత్రలో పేరుందని గుర్తు చేసిన ట్రంప్... ప్రస్తుతం భారీ పతనం దిశగా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వ్యాక్సిన్‌‌ను వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్రంప్ చెప్పారు.

English summary
President Donald Trump said on Wednesday he believes China's handling of the coronavirus is proof that Beijing "will do anything they can" to make him lose his re-election bid in November
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X