• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సింగపూర్ హోటల్లో చారిత్రక భేటీ: ట్రంప్-కిమ్ చేతులు కలిపారు, భారతీయ వంటలు

By Srinivas
|
  డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ భేటీ

  సింగపూర్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్‌లు మంగళవారం సింగపూర్‌లోని కేపెల్లా హోటల్లో భేటీ అయ్యారు. వీరి భేటీ కోసం సింగపూర్ భారీ ఏర్పాట్లు చేసింది. పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. మొదట ట్రంప్-కిమ్ ఇద్దరు ముఖాముఖి చర్చించారు. అనంతరం ఇరుదేశాల అధికారుల మధ్య చర్చలు ఉంటాయి.

  హోటల్లోై ముఖాముఖి ఎదురుపడగానే కిమ్-ట్రంప్ చేతులు కలిపారు. వీరిద్దరి కలయిక చారిత్రక సమావేశం. వీరి చారిత్రక భేటీ నేపథ్యంలో ప్రపంచం యావత్తు వీరి భేటీ ఫలితాలపై ఆసక్తిగా చూస్తోంది. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ ప్రధాన అంశంగా భేటీ జరిగింది. సింగపూర్ సహా పలు దేశాల జోక్యంతో ఈ భేటీ జరిగింది. అణునిరాయుధీకరణకు ఉ.కొరియా అంగీకరిస్తే అమెరికాా ఆ దేశం భద్రతకు హామీ ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయం అందిస్తుంది. కొరియా ద్వీపంలో శాంతి కల్పించడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. 

  Trump-Kim Meeting: One on one meeting ends, leaders take a walk together

  ఈ భేటీ కోసం వివిధ దేశాల నుంచి తరలివచ్చిన రెండున్నర వేల మందికి పైగా మీడియా ప్రతినిధుల కోసం పసందైన విందు ఏర్పాట్లు చేశారు. వీరు మూడు రోజులకు పైగా సింగపూర్‌లో ఉంటారు. భారతీయ వంటకాలైన పలావ్‌, కోడి కూర, కోడి కుర్మా, పప్పు, చేపల కూర, అప్పడం వంటివి కూడా వీరికి వడ్డించే పదార్థాల జాబితాలో ఉన్నాయి. మొత్తం 45 రకాల వంటకాలు ఉన్నాయి.

  భారత్‌తో పాటు సింగపూర్‌, మలేసియా, వియత్నాం, థాయ్‌లాండ్‌, కొరియా, జపాన్‌, చైనా, ఫ్రాన్స్‌, అమెరికా, ఇటలీ, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, మధ్యప్రాచ్య దేశాలు.. ఇలా పదిహేను భిన్న ప్రాంతాల రుచులు ఉన్నాయి. ముఖ్యంగా సింగపూర్‌లో ప్రసిద్ధ వంటకాలైన లక్సా, చికెన్‌ రైస్‌ ఉన్నాయి. కాగా, ఈ బృందంలో భారతీయ పాకశాస్త్ర నిపుణుడైన అమిత్‌ వర్మ ఉన్నారు.

  ట్రంప్‌-కిమ్‌ భేటీ సాకారమయ్యే ముందు కథ అనేక మలుపులు తిరిగింది. కిమ్‌తో సమావేశం కానున్నానని ట్రంప్‌ మే 10న ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరచారు. అనంతరం మే 24న కిమ్‌తో భేటీని రద్దు చేసుకుంటున్నానని ప్రకటించి అందర్నీ దిగ్భ్రాంతి పరిచారు. మీ అణ్వస్త్ర పాటవం గురించి అదే పనిగా గొప్పలు చెప్పుకొంటున్నారని, కానీ, మావద్ద అత్యంత శక్తిమంతమైన, అపారమైన అణ్వస్త్ర బలం ఉందని మరచిపోకండని, వాటిని మీ మీద ప్రయోగించాల్సిన అవసరం రాకూడదని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కిమ్‌ను ఉద్దేశించి ట్రంప్‌ హెచ్చరించారు. ఆ తర్వాత వారం రోజుల పాటు ముమ్మరంగా మంతనాలు జరిగాక, ట్రంప్‌-కిమ్‌ సింగపూర్‌ సమావేశం అనుకున్నట్లే జరుగుతుందని ప్రకటన వెలువడింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  మరిన్ని north korea వార్తలుView All

  English summary
  Singapore witnessed a historic event today with US President Donald Trump and North Korean head, Kim Jong Un meeting at the Capella hotel. The much awaited meeting got underway following a historic handshake by the two leaders.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more