వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘వెరీ వెరీ గుడ్‌’: కిమ్‌ను వైట్‌హౌస్‌కి ఆహ్వానించిన ట్రంప్, కీలక ఒప్పందాలపై సంతకాలు

|
Google Oneindia TeluguNews

సింగపూర్‌: ప్రపంచం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల మధ్య చారిత్రక సమావేశం మంగళవారం జరిగింది.అరుదైన ఈ భేటీకి సింగపూర్‌లోని కేపెల్లా హోటల్‌ వేదికగా మారిన విషయం తెలిసిందే.

Recommended Video

డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు దాదాపు 45 నిమిషాల పాటు ముఖాముఖి సమావేశమయ్యారు. అనంతరం తమ దౌత్యాధికారులతో కలిసి ద్వైపాక్షిక చర్యలు జరిపారు. కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ, శాంతి స్థాపనే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది.

పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి

ఉత్తరకొరియా భద్రతకు హామీ

ఉత్తరకొరియా భద్రతకు హామీ

ఈ సమావేశంలో చాలా కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు అంగీకరిస్తే ఉత్తరకొరియా భద్రతకు హామీ ఇస్తామని అమెరికా తెలిపింది. ఈ భేటీ సానుకూల ఫలితాలు ఇస్తుందని ఇరు దేశాధినేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఊహించినదానికంటే అద్భుతంగా

ఊహించినదానికంటే అద్భుతంగా

కిమ్‌తో జరిగిన ఈ భేటీ ‘వెరీ వెరీ గుడ్‌' అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ సమావేశం పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘చాలా సానుకూలంగా ఈ భేటీ జరిగింది. అందరూ ఊహించిన దానికంటే అద్భుతంగా ఈ సమావేశం జరిగిందని నేను అనుకుంటున్నా. ఈ సమావేశం ద్వారా చాలా పురోగతి చోటుచేసుకుంది.' అని ట్రంప్‌ అన్నారు.

కీలక ఒప్పందాలపై సంతకాలు

కీలక ఒప్పందాలపై సంతకాలు

కాగా, శాంతి స్థాపనకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నట్లు కిమ్‌ పేర్కొన్నారు. ఎన్నో అడ్డంకుల తర్వాత ఈ సింగపూర్‌ భేటీ సాకారమైందని.. ఎన్నో సంశయాలు, ఊహాజనితాలను ఈ భేటీతో అధిగమించామని పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ట్రంప్, కిమ్‌లు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలపై త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని ట్రంప్ చెప్పారు. అయితే, వాటి గురించిన సమాచారం ఇంకా బయటికి రాలేదు. ఇరు దేశాల మధ్య అవరోధాలను అధిగమించామని ట్రంప్ తెలిపారు.

కిమ్‌ను వైట్‌హౌస్‌కు రావాలంటూ ట్రంప్

కిమ్‌ను వైట్‌హౌస్‌కు రావాలంటూ ట్రంప్

రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ట్రంప్ తెలిపారు. ఓ పెద్ద సమస్య పరిష్కారానికి సమస్యలు ఉపయోగపడతాయని అన్నారు. శాంతి దిశగా ఓ పెద్ద అడుగు ముందుకు పడిందని తెలిపారు. అంతేగాక, కిమ్‌ను వైట్‌హౌస్‌కి ఆహ్వానించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక ఉత్తరకొరియాతో సత్ససంబంధాలు కొనసాగుతాయని అన్నారు. ట్రంప్ ఆహ్వానం నేపథ్యంలో కిమ్ త్వరలోనే అమెరికాలో కూడా పర్యటించే అవకాశం లేకపోలేదు.

English summary
US President Donald Trump and North Korean Supreme Leader Kim Jong-un on Tuesday, June 12, signed a "comprehensive" document at the conclusion of their summit in Singapore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X