వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాతో లింకుల చిక్కులు: ట్రంప్‌నకు తప్పని స్వీయ విచారణ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనకు తాను దర్యాప్తును ఎదుర్కోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. దేశాధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు రష్యాతో ఆయన అనుబంధం ఇప్పటికీ ట్రంప్‌ను వెంటాడుతూనే ఉన్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనకు తాను దర్యాప్తును ఎదుర్కోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. దేశాధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు రష్యాతో ఆయన అనుబంధం ఇప్పటికీ ట్రంప్‌ను వెంటాడుతూనే ఉన్నది. న్యాయ ప్రక్రియకు తాను అడ్డు తగులుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించిన వార్తలను డొనాల్డ్ ట్రంప్ కొట్టి పారేశారు.

కానీ ట్రంప్‌ న్యాయప్రక్రియకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారా? అనే దానిపై ప్రత్యేక కౌన్సిల్‌ రాబర్ట్‌ ముల్లర్‌ విచారణ జరుపుతున్నారని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక బయటపెట్టింది. అధ్యక్ష హోదాను దుర్వినియోగం చేసి.. న్యాయ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తే అమెరికా చట్టాల ప్రకారం దేశాధ్యక్షుడిని అభిశంషించొచ్చు. కానీ ఎన్నికల సమయంలో రష్యా పాత్రను ట్రంప్ అనుయాయులు మాత్రం పదేపదే దాట వేశారు.

మరోవైపు ఈ అంశంపై బయటపడేందుకు గల మార్గాల అన్వేషణకు అమెరికా ఉపాధ్యక్షుడు పెన్స్ ఒక ప్రైవేట్ న్యాయవాదిని నియమించుకున్నారు. వర్జీనియాలో గతంలో అమెరికా అటార్నీగా వ్యవహరించిన రిచ్మండ్ కుల్లెన్.. పెన్స్ తరఫున దర్యాప్తు చేస్తారు. ఇదీ కూడా కుల్లెన్‌ను తన వ్యక్తిగత న్యాయవాదిగా ట్రంప్ నియమించుకున్న నెల రోజుల లోపే పెన్స్ నియమించుకోవడం గమనార్హం.

మైకెల్ ప్లిన్‌కు ఇలా ఉద్వాసన

మైకెల్ ప్లిన్‌కు ఇలా ఉద్వాసన

ట్రంప్‌ ప్రచారబృందంలో కీలక పాత్ర పోషించి... ఆపై జాతీయ భద్రతా సలహాదారుగా నియమితుడైన మైకేల్‌ ఫ్లిన్‌... రష్యా రాయబారితో తన చర్చల విషయంలో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను తప్పుదోవ పట్టించారని తేలడంతో నెలలోపే ఉద్వాసనకు గురయ్యారు. హిల్లరీ క్లింటన్, ఇతర డెమొక్రటిక్‌ పార్టీ ముఖ్యనేతల ఈ మెయిల్స్‌ను లీక్‌ చేయడం ద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా ప్రభావితం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. పరోక్షంగా ట్రంప్‌ విజయానికి రష్యా దోహదపడిందనేది ఆరోపణ. వీటిపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది. విచారణను నిలిపివేయాలని, ఫ్లిన్‌ను వదిలేయాలని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీని ట్రంప్‌ కోరారు. దీన్ని కోమీ సెనెట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీకి ఇటీవల ఇచ్చిన వాంగ్మూలంలో ధ్రువీకరించారు.

జేమ్స్ కోమీ ఉద్వాసన న్యాయ ప్రక్రియకు అడ్డు తగలడమేనన్న డెమొక్రాట్లు

జేమ్స్ కోమీ ఉద్వాసన న్యాయ ప్రక్రియకు అడ్డు తగలడమేనన్న డెమొక్రాట్లు

రష్యా జోక్యంలో ట్రంప్‌ పాత్రపై విచారణ ఏమీ లేదని కోమీ స్పష్టం చేయడం అమెరికా అధ్యక్షుడికి కొంత ఊరటనిచ్చింది. అయితే మే 9వ తేదీన జేమ్స్‌ కోమీని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ పదవి నుంచి అకస్మాత్తుగా తప్పించారు. ఇది న్యాయప్రక్రియకు అడ్డుతగలడం కిందకే వస్తుందని డెమొక్రాట్లు వ్యాఖ్యానించారు. రష్యా జోక్యంపై ఎఫ్‌బీఐతో పాటు ప్రత్యేక కౌన్సిల్‌ రాబర్ట్‌ ముల్లర్‌ (ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌) కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు ముల్లర్‌... ట్రంప్‌ చర్యలు (విచారణను నిలిపివేయాలని కోరడం, కోమీకి ఉద్వాసన పలకడం) న్యాయప్రక్రియను అడ్డుకోవడం కిందకు వస్తాయా? అనే దానిపై విచారణ చేయనుండటం సంచలనం రేపుతోంది. ‘అధ్యక్షుడికి సంబంధించిన ఎఫ్‌బీఐ లీకు తీవ్ర అభ్యంతరకరం. క్షమార్హం కానిది... చట్ట విరుద్ధం కూడా' అని ట్రంప్‌ వ్యక్తిగత న్యాయవాది మార్క్‌ కాసోవిట్జ్‌ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే ట్రంప్‌ పాత్రపై దర్యాప్తు జరుగుతోందనే విషయాన్ని ఇందులోనూ ఖండించకపోవడం గమనార్హం.

నిఘా, సెక్యూరిటీ చీఫ్‌లను ప్రశ్నించనున్న ముల్లర్

నిఘా, సెక్యూరిటీ చీఫ్‌లను ప్రశ్నించనున్న ముల్లర్

నేషనల్‌ ఇంటలిజెన్స్‌ డైరెక్టర్‌ డానియల్‌ కోట్స్, నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్‌ మైక్‌ రోజర్స్‌లను ఈ వారంలో ముల్లర్‌ ప్రశ్నించనున్నారు. ట్రంప్‌ బృందానికి రష్యాతో సంబంధాలపై ఎఫ్‌బీఐ విచారణ జరుగుతోందని మార్చి 20న కాంగ్రెస్‌కు చెప్పారు కోమీ. దీంతో రష్యా కోణంలో విచారణ జరుగుతోందని తొలిసారి బహిర్గతమైంది. తనమీద ఎలాంటి దర్యాప్తు లేదని బాహటంగా ప్రకటించాలని ట్రంప్‌ కోరగా కోమీ నిరాకరించారు. దాంతో మార్చి 22న కోట్స్, రోజర్స్‌లకు వేర్వేరుగా ఫోన్‌చేసి ఇదే విషయాన్ని ప్రకటించాలని ట్రంప్‌ కోరారు. కానీ వీరిద్దరూ అధ్యక్షుడి విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ఫ్లిన్‌ను వదిలేయాల్సిందిగా కోమీకి చెప్పాలని కోట్స్‌ను ట్రంప్‌ పురమాయించాడని కూడా వార్తలు వచ్చాయి. వీటన్నింటిపై ముల్లర్‌ వీరిద్దరిని ప్రశ్నించనున్నారు.

ముల్లర్ ఉద్వాసన పలకాలంటే చిక్కుముళ్లే

ముల్లర్ ఉద్వాసన పలకాలంటే చిక్కుముళ్లే

ముల్లర్‌కు ఉద్వాసన పలకాలని ట్రంప్‌ శిబిరం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది అంత తేలికకాదు. ముల్లర్‌ను జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ నియమించింది. ఆయన అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌కు నివేదించాల్సి ఉంటుంది. ట్రంప్‌ ప్రచారబృందంలో తాను కీలక సభ్యుడిని కాబట్టి ఈ విచారణ వ్యవహారాలను తాను చూడలేనని సెషన్స్‌ తప్పుకున్నారు. డిప్యూటీ అటార్నీ జనరల్‌ రాడ్‌ రోసెన్‌స్టీన్‌ ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు. సరైన కారణాలు చూపకుండా ముల్లర్‌కు ఉద్వాసన పలకమని ట్రంప్‌ ఆదేశిస్తే... తాను పాటించడానికి నిరాకరిస్తానని మంగళవారం రోసెన్‌స్టీన్‌ కాంగ్రెస్‌కు చెప్పారు. అంటే ముల్లర్‌తో‌పాటు రోసెన్‌స్టీన్‌ను కూడా తొలగించాలి. ట్రంప్‌ పాత్రపై దర్యాప్తు జరుగుతోందని బయటికి తెలిశాక... విచారణాధికారిని తొలగించడం అంత తేలిక కాదు. తీవ్ర విమర్శలు వస్తాయి. అంతే కాదు అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణను ట్రంప్‌ నిజంగానే అడ్డుకుంటున్నారనే అభిప్రాయం బలపడుతున్నందున ఆయన ఏం చేస్తారో చూడాలి.

English summary
A heightened sense of unease gripped the White House on Thursday, as President Trump lashed out at reports that he’s under scrutiny over whether he obstructed justice, aides repeatedly deflected questions about the probe and Vice President Pence acknowledged hiring a private lawyer to handle fallout from investigations into Russian election meddling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X