భార్య పేరును తప్పుగా ట్వీట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి పేరును పొరపాటుగా రాశారు. మెలానియా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరారు. శనివారం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి వైట్ హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ ట్వీట్ చేశారు.
మన ఫస్ట్‌లేడీ మెలానీ మళ్లీ వైట్‌హౌస్‌కి రావడం సంతోషంగా ఉంది.. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నారు... మీ అందరి అభిమానానికి ధన్యవాదాలని ట్వీట్ చేశారు. అయితే మెలానియా పేరును మెలానీగా పేర్కొన్నారు.

దీంతో నెటిజన్లు దానిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది. అయితే, అంతకుముందే తన ట్వీట్లోని పొరపాటును గుర్తించిన ట్రంప్ పాత ట్వీట్ డిలీట్ చేసి మెలానియా పేరును సరిచేశారు. కానీ అప్పటికే ఈ ట్వీట్ స్క్రీన్‌షాట్లు తీసి నెటిజన్లు పోస్ట్ చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!