సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ ను ప్రకటించిన ట్రంప్.. చైనాకు వార్నింగ్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఏఐ అన్ని రంగాల్లోకీ చొచ్చుకొచ్చింది. ప్రతి చిన్న విషయానికీ ఏఐను సంప్రదించడం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కామన్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం ఏఐను చైనా శాసిస్తోందన్న ఊహాగానాల ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే అనేక రంగాల్లో ప్రపంచ దేశాలపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్న అమెరికా.. ఏఐలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ముందడుగు వేసింది.
ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్(SIF) ను ప్రకటించారు. అలాగే నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన జే క్లేటన్ కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆయనతోపాటు ఫెడరల్ ట్రేడ్ కమిషన్(FTC) చైర్మన్ ఆండ్రూ ఫెర్గుసన్, డిఫెన్స్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఈమిల్ మైఖేల్ లను సభ్యులుగా ట్రంప్ ప్రకటించారు. అలాగే యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ స్కాట్ కూపర్ కూడా ఈ టీమ్ లో ఓ సభ్యుడిగా ఉన్నారు.
సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ విధి విధానాలను సైతం ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రయోజనాలను కాపాడేందుకు ఈ SIF సంస్థ.. వినియోగదారులు, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థలు, మతపరమైన సంస్థలు అలాగే కీలక మౌళిక సదుపాయాలను కల్పించే సంస్థలతో ఫెడరల్ గవర్నమెంట్ జరిపే చర్చలు, సహకార కార్యక్రమాలను సమన్వయం చేస్తుందని తెలిపారు. సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ ప్రపంచ దేశాల్లో ఏఐ విషయంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది అమెరికన్ల ప్రయోజనాలను కాపాడి వారి జీవితాలను మెరుగుపరుస్తుందని ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇక సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ పై ట్రంప్ గత నెలలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏఐ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు.. ఇది స్పేస్ ఫోర్స్ మాదిరిగా ఉంటుందని వివరించారు. అలాగే తాజాగా క్లేటన్ ను దీనికి హెడ్ గా ప్రకటించడంతో ఆయన్ను ట్రంప్ ఎంతగా విశ్వసిస్తున్నారో అర్థం అవుతుంది. ఇదే విషయంపై క్లేటన్ మాట్లాడుతూ.. ఏఐ విషయంలో చైనా నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోందని కానీ సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ చైనాను అధిగమిస్తుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
