వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే దేశం-ఒకే హృదయం, అమెరికన్లకే ప్రాధాన్యం: ట్రంప్ ప్రమాణం, 9 లక్షలమంది హాజరు

అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.. కుటుంబ సభ్యులతో కలిసి ట్రంప్‌ వైట్ హౌస్ వచ్చారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ నలుమూలల నుంచి ఆయన మద్దతుదారులు వచ్చారు. దీంతో సందడి నెలకొంది. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ మాట్లాడారు.

donald trump

ఇక్కడితో దొంగతనాలు ఆగిపోతాయి: ట్రంప్

తమ పాలన అంతా భవిష్యత్తు పైనే అన్నారు. ఎన్నో పరిశ్రమలు మూతపడి ఉద్యోగాలు పోయాయన్నారు. దోపిడీలు, దొంగతనాలు ఇక్కడితో ఆగిపోతాయన్నారు. ప్రజలు భద్రత, ఉపాధి కోరుకుంటున్నారన్నారు.

మాటలు ముగిశాయి, ఇక చేతలే ఉంటాయన్నారు. అంతా కలిసి అమెరికాను గొప్ప దేశంగా నిర్మిద్దామన్నారు. అమెరికన్లతో కలిసి దేశాన్ని పునర్మిస్తామన్నారు. ఒకే దేశం, ఒకే అమెరికా.. ఈ విజయం అమెరికాదే అన్నారు. ప్రజలకు అధికారం వచ్చిన ఈ రోజు అందరికి గుర్తుంటుందన్నారు.

అమెరికన్లకే తొలి ప్రాధాన్యం, మన ఉద్యోగాలు తీసుకొస్తా

ఇది అధికార బదలీ కాదన్నారు. ప్రజల చేతికి అధికారంలోకి వచ్చిన రోజు అన్నారు. ఈ రోజు నుంచి అమెరికన్లను దోచుకోవడం నిలిచిపోతుందన్నారు. అందరం కలిసి భావి అమెరికాను నిర్మిద్దామన్నారు. అమెరికన్లే ప్రథమ ప్రాధాన్యంగా ఇకపై నిర్ణయాలు ఉంటాయన్నారు. అన్ని అంశాల్లోను మనకే ప్రాధాన్యం అన్నారు. ఇకపై తీసుకునే ప్రతి నిర్ణయం అమెరికన్లకు లాభం జరుగుతుందన్నారు. ఇన్నాళ్లుగా కోల్పోయిన ఉద్యోగాలను తీసుకు వస్తామన్నారు.

ఒబామా దంపతులకు థ్యాంక్స్.. అమెరికాను పునర్ నిర్మిస్తా

ఈ మూమెంట్ ఇక్కడ హాజరైన వారి అందరిదీ అని తాను ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ట్రంప్ అన్నారు. బరాక్ ఒబామా దంపతులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా పునర్ నిర్మాణమే తన లక్ష్యమని చెప్పారు. తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. వాషింగ్టన్ డీసీ నుంచి అధికారాన్ని ప్రజలకే ఇస్తామని చెప్పారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారం

- అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ట్రంప్‌తో సుప్రీం చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణ స్వీకారం చేయించారు.

- ఎనిమిదేళ్లపాటు అమెరికాకు అధ్యక్షుడిగా సేవలందించిన ఒబామా.. ఆయన సతీమణి మిషెల్‌ సాదరస్వాగతం పలుకుతూ ఆప్యాయంగా పలకరిస్తూ కరచాలనం చేశారు.
- ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారం చేశారు.

- బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ తదితరులు పాల్గొన్నారు.

- వైట్ హౌస్ సర్వాంగ సుందరంగా తయారయింది.
- ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి 9 లక్షల మంది హాజరయ్యారు.
- పది గంటలకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం ప్రారంభమయింది.

- మెలానియా ట్రంప్, మైక్ పెన్స్ భార్య వచ్చారు.
- మిచెల్లీ ఒబామా, జిల్ బిడెన్ వచ్చారు.
- మరోవైపు, ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని నిరసిస్తూ చాలామంది వాషింగ్టన్ డీసీలో నిరసనలు చేపట్టారు. వారిపై పోలీసులు పెప్పర్ స్ప్రేలు ఉపయోగించారు.
- ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు చేరుకున్న ట్రంప్. ఆయనతో పాటు బరాక్ ఒబామా కూడా కాపిటల్ హాల్ చేరుకున్నారు.

trump

- బరాక్ ఒబామా శ్వేత సౌధం నుంచి బయటకు వచ్చారు.
- మిచెల్లీ ఒబామా, మెలానియా ట్రంప్ శ్వేతసౌధం నుంచి బయటకు వచ్చారు.
- బెర్నీ శాండర్స్ ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకున్నారు.
- బరాక్ ఒబామా తేనీటి విందులో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు.
- బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్‌లు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కాపిటో హిల్ చేరుకున్నారు.

English summary
Donald Trump will soon be sworn in as the 45th President of the United States during a historic transfer of power that encapsulates American democracy even in politically divisive times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X