కిమ్‌కు షాక్: సైనిక చర్యకు రెఢీ, ఉ.కొరియాపై ట్రంప్ నిప్పులు

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఉత్తరకొరియాపై అమెరికా అధ్యక్షుడు కిమ్ నిప్పులు చెరిగారు. తన వైఖరిని మార్చుకోకపోతే ఉత్తరకొరియాపై సైనిక చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.

కిమ్‌కు చైనా షాక్: సరిహద్దులో మిలటరీ డ్రిల్, ఉ.కొరియాకు దెబ్బేనా?

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ అనుసరిస్తున్న వ్యవహరశైలిపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో తన వైఖరిని మార్చుకోవాలని కిమ్‌ను పలు దేశాలు కోరుతున్నాయి.

కిమ్ ఆస్తులపై అమెరికా కన్ను: ఉ.కొరియాపై ట్రంప్ మరిన్ని ఆంక్షలు

ఉత్తరకొరియా మాత్రం ప్రపంచదేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా తమ వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. ప్రపంచ దేశాలు చేస్తోన్న హెచ్చరికలను కాదని అణుపరీక్షలను,క్షిపణి ప్రయోగాలకు పాల్పడుతోంది ఉత్తరకొరియా.

అమెరికా కట్టడికి కిమ్ ఇలా, ట్రంప్ సహనానికి కారణమిదే!

గత ఆదివారం నాడు ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగించింది. ఈ బాంబు ప్రయోగంతో ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. ఉత్తరకొరియా అమెరికా సహ మిత్రదేశాలకు ఈ బాంబు ప్రయోగం ద్వారా తన సత్తాను చూపించింది.

సైనిక చర్య తప్పదు ట్రంప్

సైనిక చర్య తప్పదు ట్రంప్

ఉత్తరకొరియాకు చెడురోజులు మొదలయ్యాయని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.. ఉత్తరకొరియా ఎగుమతులపై అంక్షలు విధించామన్నారు. అణ్వాయుధాల తయారీని అడ్డుకోనేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు ట్రంప్. పలు మార్లు హెచ్చరించినా మార్పు రాకపోవడంతో సైనిక చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.

సవాల్ విసిరిన కొరియా

సవాల్ విసిరిన కొరియా

అనేక ఆంక్షలు విధించినా ఉత్తరకొరియాలో మార్పు రాలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఉత్తరకొరియా అనుసరిస్తున్న విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు.కానీ, ఆంక్షలు విధించిన తర్వాత 6వ, సారి అణుపరీక్షలు నిర్వహించి ఉత్తరకొరియా సవాల్ విసిరిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.ఉత్తరకొరియా అమెరికాకే సవాల్ విసిరిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంక్షలతో ఫలితం లేదని తేలింది

ఆంక్షలతో ఫలితం లేదని తేలింది

ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించడం వల్ల ఫలితం లేదని తేలిందన్నారు ట్రంప్. ఉత్తరకొరియాపై అనుసరించే విధానంపై చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ , అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పోన్లో మాట్లాడారు. అయితే ఇప్పటికిప్పుడే సైనిక చర్యకు తాము సిద్దంగా లేమని ట్రంప్ ప్రకటించారు. చైనా కూడ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానీ, కొరియా వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదని ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు.

కొరియాకు బుద్దిచెప్పాల్సిందేనన్న ట్రంప్

కొరియాకు బుద్దిచెప్పాల్సిందేనన్న ట్రంప్

ఉత్తరకొరియాపై మరిన్ని కఠినమైన అంక్షలు విధించి కట్టడి చేయాలనుకుంటున్నామని ట్రంప్ తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి ప్రయత్నాలు ఫలించకపోవచ్చని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు.చివరికి సైనిక చర్య మాత్రమే తమ అంతిమ లక్ష్యంగా కనపడుతుందని ట్రంప్ తన మనసులో మాటను బయటపెట్టారు. అది కేవలం చాయిస్ మాత్రమేనని ఆయన తెలిపారు. ఉత్తరకొరియా ఇదే విధమైన ధోరణి మరోసారి ప్రదర్శిస్తే తప్పకుండా ఉత్తరకొరియాపై సైనిక చర్య తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. అదే జరిగితే భవిష్యత్తులో ఉత్తరకొరియా ఇక కోలుకోలేనంతగా దెబ్బ తింటుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After North Korea tested its biggest nuclear device ever on Sunday, President Donald Trump responded with the kind of harsh language that’s become increasingly normal in his administration. He blasted a US ally, South Korea, for being soft on the North, and made threats against the Kim regime.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి