వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్ సంక్షోభానికి జో బైడెన్ కారణం..? ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధమే ?? : ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఈ దురాక్రమణను ఖండిస్తూ.. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం లెక్కచేయడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా సేనలు మరింత విద్వంసానికి పాల్పడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్రమైయ్యే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.

 జో బైడెన్ మహా పిరికి..

జో బైడెన్ మహా పిరికి..


రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య దాడులు ఇలాగే కొనసాగితే యూడో ప్రపంప యుద్థం తథ్యమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లో మహా పిరికితనం, అసమర్థత వంటి బలహీనతలు ఉన్నాయని విమర్శించారు. ఈ భయంకరమైన యుద్ధంలో అమెరికన్ సైనికులు చిక్కుకోకుండా ఉక్రెయిన్-రష్యా మధ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇంకా పరిష్కారమార్గాలున్నాయన్నారు. ఉక్రెయిన్ సంక్షోభానికి జో బైడెన్ పాలనా యంత్రాంగమే ఒక రకంగా కారణమని పేర్కొన్నారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని కూర్చోబెట్టి మాట్లాడేందుకు అమెరికాకు ఎవ్వరూ లేరని ట్రంప్ విమర్శించారు.

 మూడో ప్రపంచ యుద్ధం ముప్పు

మూడో ప్రపంచ యుద్ధం ముప్పు


రష్యాకు దీటుగా అమెరికా స్పందించాల్సి ఉందని ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమదేశాలు రష్యా ఇంధన వనరులపై ఆధారపడకుండా చేయోచ్చన్నారు. దీని వలన కలిగే పరిణమాలను తెలియ జేస్తూ రష్యాను మరింత బెదించవచ్చంటూ సూచించారు. తన వ్యక్తిత్వమే తన పాలనలో అమెరికాను యుద్ధం నుంచి దూరంగా ఉంచిందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవే పరిణమాలు కొనసాగితే మూడో ప్రపంచ యుద్దానికి దారితియొచ్చని అభిప్రాయపడ్డారు. తాను యుద్ధానికి పూర్తిగా వ్యతిరేకమని ట్రంప్ స్పష్టం చేశారు.

 పుతిన్‌తో చర్చలకు సిద్ధం

పుతిన్‌తో చర్చలకు సిద్ధం

మరోవైపు గత 18 రోజులుగా రష్యా దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలమైంది. ఎటు వైపు చూసిన విధ్వంసం దృశ్యాలే. రష్య సేనలు ఉక్రెయిన్ నగరాలను తీవ్ర స్థాయిలో ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లాయి. వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌తో మాట్లాడిన జెలెన్ స్కీ.. పుతిన్‌తో జెలుసలెంలో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని కోరారు.

English summary
Trump made key remarks that the Ukraine-Russia war is likely to escalate further
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X