వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చట్టబద్ధమా?: అల్లుడికి పదవి కట్టబెట్టిన ట్రంప్, కూతురు 'షిఫ్ట్' ఆలోచన

అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తన అల్లుడు జారెద్ కుష్నర్‌కు కీలక పదవిని కట్టపెట్టారు. తనకు సీనియర్ సలహాదారుగా అల్లుడిని నియమించారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తన అల్లుడు జారెద్ కుష్నర్‌కు కీలక పదవిని కట్టపెట్టారు. తనకు సీనియర్ సలహాదారుగా అల్లుడిని నియమించారు. వాణిజ్యం, మిడిల్ ఈస్ట్ వ్యవహారాల్లో సలహాలు ఇచ్చే బాధ్యతను కుష్నర్‌కు అప్పగించారు.

ట్రంప్ అల్లుడికి పదవి

ట్రంప్ అల్లుడికి పదవి

కుష్నర్.. ట్రంప్ కూతురు ఇవాంక భర్త. ఎన్నికల నాటి నుంచి ట్రంప్‌ ఎక్కువగా అతని పైన ఆధారపడుతున్నారు. ఇటీవల ట్రంప్‌ క్యాబినెట్‌ ఇంటర్వ్యూలకు, బ్రిటన్‌ విదేశాంగమంత్రి సమావేశంలో ఆయన సాయపడ్డారు.

ప్రచారంలో పాల్గొన్న కుమార్తె

ప్రచారంలో పాల్గొన్న కుమార్తె

ట్రంప్‌ కుమార్తె ఇవాంక కూడా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ కీలక పాత్ర పోషించారు.

అమెరికాలో చట్టం

అమెరికాలో చట్టం

అమెరికా చట్టాల్లో ఒక కీలక అంశం ఉంది. 1967లో చట్టం ప్రకారం కుటుంబ సభ్యుల నుంచి ప్రభుత్వ అధికారులను ఎంపిక చేసుకునే ఆచారంపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి బంధువులు కీలక పదవులను చేపట్టడం చాలా చాలా అరుదు.

కుష్నర్‌కు పదవి

కుష్నర్‌కు పదవి

ఇప్పుడు, కుష్నర్‌కు ట్రంప్ పదవి ఇచ్చారు. అయితే, 1967లో చట్టం ప్రకారం కుటుంబ సభ్యుల నుంచి ప్రభుత్వ అధికారులను ఎంపిక చేసుకునే ఆచారంపై నిషేధం నిబంధన కుష్నర్‌కు వర్తించదని సోమవారం ఆయన లాయర్‌ తెలిపారు. దీనికి తోడు ట్రంప్‌.. కుష్నర్‌కు మద్దతుగా ఒక ప్రకటన జారీ చేశారు.

వెలకట్టలేని వ్యక్తి

వెలకట్టలేని వ్యక్తి

కుష్నర్‌ తన బృందంలో వెలకట్టలేని వ్యక్తి అని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే కుష్నర్‌.. ట్రంప్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ సీఈవోగా, న్యూయార్క్‌ అబ్జర్వర్‌గా రాజీనామా చేశారు. మరోపక్క ఇవాంకా కూడా ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ నుంచి, సొంత ఫ్యాషన్‌ బ్రాండ్‌ బిజినెస్‌ నుంచి తప్పుకొన్నారు.

చట్ట నిర్ధారణ

చట్ట నిర్ధారణ

కాగా, చట్టబద్దమైన ఆమోదం లభించిన వెంటనే 35 ఏళ్ల కుష్నర్ సలహాదారు పదవి చేపడతారు. 1967 నాటి చట్టం ఉల్లంఘించలేదని నిర్ధారణ కావాల్సి ఉందని అంటున్నారు. సలహాదారుకు జీతం చెల్లించరు కాబట్టి సెనేట్ ఆమోదం అవసరం లేదు.

షిఫ్ట్

షిఫ్ట్

కుష్నర్ తనకు లభించిన అద్భుత ఆస్తి, ఎన్నికల ప్రచారం, అధికార బదలీలో నమ్మకమైన సలహాదారుగా నిలిచాడని ట్రంప్ పేర్కొన్నారు. తన భర్తకు కీలక పదవి దక్కడంతో తాను ఇంటికే పరిమితం కావాలని ఇవాంకా భావిస్తున్నారు. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్‌కు మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట.

English summary
Trump's son in law Kushner to become senior White House adviser.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X