వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్ పైత్యం : ‘కరోనా పోరులో వైద్యులు, నర్సుల మరణాలు అందంగా ఉన్నాయి’

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటి దురదను చాటుకున్నారు. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత సరిదిద్దుకున్న ఈయన.. మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా పోరులో ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్న వైద్యులు, నర్సులను ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి.

కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే? కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?

వైద్యులు, నర్సుల మరణాలు అందంగా ఉన్నాయంటూ..

పీపీఈ కిట్స్ కొరతపై జరిగిన సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. యుద్ధంలో పోరాడుతూ బుల్లెట్ల తాకిడికి నేలకొరిగిన సైనికులలాగా కరోనాపై పోరు జరుపుతున్న వైద్యులు, నర్సులు మరణిస్తున్నారు. ఇది చూడటానికి చాలా అందంగా ఉందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరే చేయండంటూ ఆగ్రహ జ్వాలలు..

మీరే చేయండంటూ ఆగ్రహ జ్వాలలు..

అంత అందంగా ఉంటే ఆయన(ట్రంప్)నే చేయమనండి అంటూ మండిపడుతున్నారు. ఎక్కడైనా మరణించడం అందంగా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై వైద్యులు, నర్సులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక నర్సుగా చెబుతున్నా.. ఇది చూడటానికి అందంగా లేదు అని చురకలంటించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, నర్సులపై ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడుతున్నారు.

అమెరికాలో వైద్యులు, నర్సుల ఆవేదన

అమెరికాలో వైద్యులు, నర్సుల ఆవేదన

కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో చోటు చేసుకున్న మరణాల్లో అమెరికాలోనే ఎక్కువగా సంభవించాయి. కరోనా బాధితులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే, వీరికి వైద్యం అందిస్తున్న వైద్యులకు, నర్సులకు మాత్రం తగినన్నీ పీపీఈ కిట్స్ లేకపోవడం గమనార్హం. దీంతో కరోనా బాధితులకు వైద్యం అందిస్తూ వైద్యులు, నర్సులు కూడా అస్వస్థకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తమ ప్రాణాలు పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోనే అత్యధిక మరణాలు..

అమెరికాలోనే అత్యధిక మరణాలు..


అమెరికాలో ఇప్పటి వరకు 1.45 మిలియన్ల మంది కరోనా బారినపడ్డారు. వీరిలో రెండున్నర లక్షల మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 86,571 మంది ఇప్పటి వరకు మరణించారు. ప్రపంచంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు కూడా అమెరికాలోనే సంభవించడం గమనార్హం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.44 మిలియన్ల మంది కరోనా బారిన పడగా, 1.59 మిలియన్ల మంది కోలుకున్నారు. 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

English summary
We wouldn't have thought that the US President has a limited vocabulary. Or does he? At a press briefing, US President Donald Trump said that nurses and healthcare workers sacrificing their lives to fight the Covid-19 pandemic is a "beautiful thing to see". Yes, 'beautiful'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X