భారత్ లో వద్దు.. పెట్టుబడులపై యాపిల్ సీఈఓకు ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సౌదీ అరేబియా పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అక్కడ నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో ట్రంప్ మాట్లాడారు. ఆయన పక్కనే యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఉన్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టొద్దని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కు సలహా ఇచ్చినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
దోహా నగరంలో నిర్వహించిన వాణిజ్య ప్రెస్ మీటింగ్ లో డొనాల్డ్ ట్రంప్ పాల్గొని భారత్ ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన పక్కనే యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ కూడా ఉన్నారు. " నాకు టిమ్ కుక్ తో చిన్న సమస్య ఉంది. నేను అతనికి చెప్పాను. మై ఫ్రెండ్. నేను నిన్ను బాగానే చూసుకుంటున్నా. మీరు 500 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ముందుకొస్తున్నారని విన్నాను. ఈ పెట్టుబడులు భారత్ లో పెడుతున్నారని విన్నాను. మీరు భారత్ ను ఎంచుకోవడం నాకు ఇష్టం లేదు. మీకు ఇండియా అభివృద్ధి చెందాలి.. మా కంపెనీకి ఏమైనా పర్వాలేదు అంటే మీ ఇష్టం. భారత్ లో టారిఫ్ లు చాలా అధికం. దాని వల్ల ఆ దేశం లాభపడుతుంది. కానీ యాపిల్ కూ ఏమీ రాదు. అందుకే నేను ఈ మాటలు చెప్తున్నా" అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికాకు కూడా భారత్ ఓ ఆఫర్ ఇచ్చిందని ట్రంప్ తెలిపారు. జీరో టారిఫ్ విధానంతో ఇరు దేశాలు ముందుకెళ్తాదని భారత్ ప్రతిపాదించినట్లు ట్రంప్ ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. భారతీయులు తమను తాము కాపాడుకోగలరు. అందుకే యాపిల్ సంస్థ అక్కడ పెట్టుబడులు పెట్టొద్దని అంటున్నామని ఈ మేరకు ట్రంప్.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో కలిసి అన్నారు.
మరోవైపు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ను అమెరికాకు ఆహ్వానించారు ట్రంప్. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. కంపెనీకి అమెరికా అన్ని విధాల అండగా ఉంటుందని పేర్కొన్నారు. యాపిల్ సంస్థకు ప్రస్తుతం భారత్ లో మూడు ప్లాంట్లు ఉన్నాయి. తమిళనాడులో రెండు, కర్ణాటకలో ఒకటి ఉన్నాయి.












Click it and Unblock the Notifications