ట్రంప్ మళ్లీ బాదేశాడు...! మన బొమ్మకు దిమ్మతిరిగేలా..!
అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుసగా విదేశాలపై కక్ష గట్టినట్లు వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సుంకాలతో రెచ్చిపోతున్నారు. భారత్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు సుంకాలు బాదేస్తున్నారు. రష్యా చమురు కొంటున్నామనే కారణంతో నేరుగా భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. ఇప్పుడు పరోక్షంగా మన దేశాన్ని భారీగా దెబ్బతీశారు.
భారత్ పేరెత్తకుండానే విదేశీ సినిమాలు, ఫర్నిచర్ వంటి మన దేశం నుంచి ఎగుమతి అయ్యే రెండు అంశాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ఇవాళ తన సోషల్ ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్టు చేసారు. అమెరికా బయట తయారయ్యే ఏదైనా మరియు అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు చెప్పారు. ఇతర దేశాలు పిల్లల నుండి మిఠాయిని దొంగిలించినట్లు అమెరికా నుండి సినిమా నిర్మాణ వ్యాపారాన్ని దొంగిలిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

తమ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని అమెరికా నుండి ఇతర దేశాలు ఒక శిశువు నుండి మిఠాయి దొంగిలించినట్లే దొంగిలించాయని టంప్ ఆరోపించారు. బలహీనమైన, అసమర్థ గవర్నర్‌తో కాలిఫోర్నియా ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతిందన్నారు. అందువల్ల, ఈ దీర్ఘకాల, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించడానికి, తాను అమెరికా బయట నిర్మించే ఏవైనా, అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తానని ప్రకటించారు.

మరోవైపు నార్త్ కరోలినా తన ఫర్నిచర్ వ్యాపారాన్ని చైనా, ఇతరులకు పూర్తిగా కోల్పోయిందని పేర్కొంటూ, ఇతర దేశాలు తయారు చేసే ఫర్నిచర్‌పై గణనీయమైన సుంకాలను విధిస్తామని ట్రంప్ మరో ప్రత్యేక పోస్ట్‌లో ప్రకటించారు. చైనా , ఇతర దేశాల చేతిలో పూర్తిగా ఫర్నిచర్ వ్యాపారాన్ని కోల్పోయిన నార్త్ కరోలినాను మళ్ళీ గొప్పగా మార్చడానికి, అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయని ఏ దేశంపైనా తాను గణనీయమైన సుంకాలను విధిస్తానన్నారు. దీనిపై వివరాలు వెల్లడిస్తానని హింట్ ఇచ్చారు. ఇప్పటికే భారత్ లో తయారవుతున్న పలు వస్తువులపై 50 శాతం సుంకాల మోత మోగించిన ట్రంప్.. ఇప్పుడు 100 శాతం సుంకాల హెచ్చరికలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications