వెనీజులాను మేమే పరిపాలిస్తాం: ట్రంప్ సంచలనం

వెనీజులాపై అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. తన డైరెక్షన్ లో అమెరికా సైన్యం వెనీజులా రాజధాని కరాకస్ పై దాడులు నిర్వహించిందన్నారు. ఈ దాడిలో అమెరికా సైన్యం వీరోచిత పోరాటం చేసిందని ప్రశంసించారు. వరల్డ్ వార్ 2 నుంచి అమెరికా సైన్యం ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారని ట్రంప్ అన్నారు.

వెనీజులా నియంత అయిన నికోలస్ మదురోనూ చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు అమెరికా సైన్యం పోరాటం చేసిందని ట్రంప్ అన్నారు. అమెరికా చరిత్రలోనే ఇలాంటి పోరాటం ఎప్పుడూ జరగలేదు. ఇటీవల ఇరాన్ పై మిడ్ నైట్ హామర్ ఆపరేషన్ చేపట్టి.. న్యూక్లియర్ సైట్స్ ను అమెరికా సైన్యం ధ్వంసం చేసిన విషయం తెలిసిందేనని ట్రంప్ తెలిపారు. వెనీజులాపై జరిపిన దాడిలో మదురోతోపాటు ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ ను కూడా కస్టడీలోకి తీసుకున్నాం. వాళ్లు ఇప్పుడు అమెరికా న్యాయ స్థానాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది.

Trump s Bold Claim US to Run Venezuela After Airstrikes and Maduro Capture

"ఈ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించిన అమెరికా సైన్యానికి కృతజ్ఞతలు. స్పీడ్, చురుకుదనం, నాణ్యతతో దాడులు జరిపారు. అమెరికన్ మిలిటరీ సేఫ్. ఎవరూ మృతి చెందలేదు. భూ గ్రహంలోనే అమెరికా దృఢమైన మిలిటరీ. వెనీజులాను మేమే పరిపాలిస్తాం. సురక్షితమైన, న్యాయమైన పరిపాలన అందిస్తాం" అని ట్రంప్ అన్నారు.

"గత రాత్రి మా బలగాలు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాయి. వెనీజులా అధ్యక్షుడు మదురో ఆయన భార్యను చట్టం ముందు నిలబెడతాం. ప్రస్తుతం వెనీజులాను మా అధీనంలో నడుపుతాం. మా బలగాలు అద్భుతంగా పని చేశాయి. ఆయిల్ వనరులపై సమీక్ష చేస్తాం. వెనీజులా పై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. వెనీజులా ప్రజలకు శుభాకాంక్షలు. వెనీజులాపై ఆధిపత్యం చెలాయించే అవకాశం మరొకరికి ఇవ్వం. వెనీజులా సంక్షేమం కోసం పనిచేస్తాం. narco terror కింగ్ పిన్ గా మదురో ఉన్నారు. వెనీజులా పరిస్థితి సాధారణ స్థితికి తీసుకొస్తాం. వెనీజులా ప్రజలు సుభిక్షంగా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం" అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+