ప్రఖ్యాత మ్యూజియంపై ఉగ్రవాదుల దాడి: 21మంది మృతి(ఫొటోలు)
ట్యూనిస్: ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యునీషియా రాజధాని ట్యునిస్‌లో ఉగ్రవాదులు పార్లమెంటు సమీపంలోని ప్రఖ్యాత బర్దో మ్యూజియంపై దాడికి దిగారు. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది విదేశీ పర్యాటకులే వున్నట్లు తెలిసింది. కాగా, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి.
మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. వీరి కోసం గాలిస్తున్నారు. బర్దో మ్యూజియం లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికార ప్రతినిధి అలీ అరోయి మీడియాకు తెలిపారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడినట్లు చెప్పారు.

మ్యూజియంపై దాడి జరిగిన సమయంలో సుమారు వంద మంది సందర్శకులు ఉన్నారని తెలిపారు. చాలా మంది బయటకు వచ్చారని.. మ్యూజియంలో బందీలుగా వున్నవారిని విడిపించినట్టు తెలిపారు.
#Bardo: Up to 20 people in serious condition, taken to hospital in #Tunis http://t.co/S2uNPdh3Q4 (pic @farouk3afi) pic.twitter.com/gKu6oB5s6Q
— RT (@RT_com) March 18, 2015 కాగా, ట్యునీషియాలో ఉగ్రవాదుల దాడిలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోవడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండె సంతాపం ప్రకటించారు. ట్యునీషియా అధ్యక్షుడు బెజి సెయిద్‌కు ఆయన తన సంతాప సందేశం పంపారు.












Click it and Unblock the Notifications