టర్కీ: అంకారాలోని ఏరోస్పేస్ సంస్థపై భారీ ఉగ్రదాడి, పలువురు మృతి
అంకారా: టర్కీలోని ఏరోస్పేస్ సంస్థపై భారీ ఉగ్రదాడి జరిగింది. టర్కీ రాజధాని అంకారా శివారులో ఉన్న టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(TUSAS) ప్రధాన కార్యాలయంపై సాయుధ దుండగులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. పదుల సంఖ్యలో గాయపడినట్లు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు.
ఈ దాడి ఉగ్రవాదుల పనేనని మంత్రి తెలిపారు. అయితే, దాడికి ఏ ఉగ్రవాద సంస్థ పాల్పడిందనే విషయంపై స్పష్టత లేదు. అంకారా శివారులో ఉన్న టర్కిష్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీలోకి కొందు సాయుధ ఉగ్రవాదులు చొరబడ్డారు. భద్రతా సిబ్బంది విధులు మారుతున్న సమయంలో లోనికి ప్రవేశించారు.

ప్రవేశమార్గంలో ఓ వ్యక్తి బాంబు పేలుడుకు పాల్పడగా.. మిగితా దుండగులు లోనికి ప్రవేశించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ తర్వాత ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని తెలిపింది. ఏరోస్పేస్‌లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని.. ఉగ్రవాదులు కంపెనీలోని సిబ్బందిని బందీలుగా చేస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
"Concerned about the hostage situation in #Turkey. Thoughts with the families. Urgent action needed for a swift and peaceful resolution."#Turkey #Ankara pic.twitter.com/gtdmJisdNs
— Divyanshu Das🇮🇳 (@DivyanshuDas5) October 23, 2024
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా సిబ్బందితోపాటు అంబులెన్స్‌లు, అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
#Shocking visuals from Ankara after deadly #TerroristAttack at #TUSAS facilities.#Terrorist are clearly visible
— Vicky Gurjar (@VeekeshGujjar) October 23, 2024
Pray for #Ankara🙏#Turkey #TerrorAttack #Russia #ViralVideos #Encounter #XiJingping pic.twitter.com/nWpl9Q0i4B
ఉగ్రదాడి ఘటనపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రదాడిలో మరణించినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు, దాడులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.












Click it and Unblock the Notifications