పాకిస్థాన్ కు టర్కీ సపోర్ట్ .. చావు దెబ్బ కొట్టిన భారత్.. రిటర్న్ గిఫ్ట్ మామూలుగా లేదుగా..!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అయితే భారత్ నుంచి దాడులను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ కు టర్కీ సాయం చేసింది. దీంతో టర్కీపై మనదేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. టర్కీపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా టర్కీతో వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేయాలని భావించినట్లు తెలుస్తోంది.
మరోవైపు టర్కీకి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఏటా భారత్ నుంచి వేల మంది పర్యాటకులు టర్కీ అందాలను వీక్షించేందుకు ఆ దేశం వెళ్తుంటారు. అయితే తాజాగా పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన టర్కీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో మన ట్రావెల్ ఏజెన్సీలు టర్కీ ఆన్‌లైన్ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో టర్కీ పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం పడనుంది.
అంతేకాక అనేక రంగాల నుంచి టర్కీకి భారత్ నుంచి ఉచ్చు బిగుస్తోంది. దిల్లీలోని ప్రఖ్యాత జేఎన్‌యూ తాజాగా కీలక ప్రకటన చేసింది. టర్కీలోని ఇనొను యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందం (ఎంవోయూ) ను నిలిపేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. దేశ భద్రత దృష్ట్యా ఇటీవల టర్కీలోని ఇనొను యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఎంవోయూను ప్రస్తుతం నిలిపేస్తున్నట్లు జేఎన్‌యూ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.
మరోవైపు పాకిస్థాన్ కు సపోర్ట్ చేసిన టర్కీకు బుద్ధి చెప్పాలని దేశవ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాయికాట్ టర్కీ నినాదం ఎక్స్ లో ఊపందుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు ఆపరేషన్ సిందూర్ పై పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారానికి టర్కీ, చైనా మద్దుతిస్తున్నాయి. దీంంతో ఈ రెండు దేశాలకు బుద్ధి చెప్పాలని భారత్ భావించింది. అందులో భాగంగానే.. చైనా, టర్కీకి చెందిన కొన్ని 'ఎక్స్' అకౌంట్లను భారత ప్రభుత్వం బ్లాక్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

టర్కీ భారత్ చేసిన సాయాన్ని మరచిపోయి ప్రవర్తించింది. 2023లో టర్కీలో భారీ భూకంపం సంభవించింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఆ సమయంలో అన్ని ప్రపంచ దేశాల కంటే ముందు టర్కీకి సాయం చేసిన దేశం భారత్. కానీ టర్కీ మాత్రం పాకిస్థాన్ కు సపోర్ట్ చేసింది.












Click it and Unblock the Notifications