China Twin Sisters: వీళ్లు మామూలు కవలలు కాదు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 సార్లు..
టెక్నాలజీలో మేటిగా ఉన్న చైనాలో ఓ కవల సోదరీమణులు జంట అధికారులను బురిడీ కొట్టించిన తీరు ఆర్చశ్యపరచకమానదు. ఈ సోదరీమణులు అధికారులను మోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 సార్లు ఒకరి పాస్ పోర్ట్ తో మరొకరు విదేశాలకు వెళ్లి వచ్చారు. చైనా వార్తా సంస్థ హర్బిన్ డైలీ ప్రకారం.. ఉత్తర చైనా నగరమైన హర్బిన్‌కు చెందిన వీ, హాంగ్ కవలలు.
సోదరీమణులలో ఒకరైన హాంగ్ తన జపనీస్ భర్తతో కలిసి జపాన్‌కు వెళ్లాలనుకుని వీసాకు దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆమె వీసా దరఖాస్తు పదేపదే తిరస్కరించారు.అప్పటికే సోదరి వీ కి జపాన్ కు వెళ్లడానికి వీసా ఉంది. దీంతో హాంగ్ సరికొత్త ఆలోచన చేసింది. తమ ఇద్దరి ముఖ కవలికలు ఒకేలా ఉండడంతో వీ పాస్ పోర్ట్ మీద జపాన్ కు వెళ్లాలని ప్లాన్ వేసింది. వీ పాస్ పోర్ట్ తో జపాన్ కు వెళ్లింది. హాంగ్ తన సోదరీమణి వీ పాస్ పోర్ట్ తో తరువాత చైనా, జపాన్, రష్యా మధ్య కనీసం 30 సార్లు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు.

చైనా అధికారులు ఈ ఏడాది ప్రారంభంలో ఈ మోసాన్ని గుర్తించారు.అయితే ఈ మోసం చివరకు ఎలా వెలుగులోకి వచ్చిందో స్పష్టంగా తెలియదని అవుట్‌లెట్ నివేదించింది. ఇద్దరు సోదరీమణులు మేలో చైనాకు తిరిగి వచ్చారు. సోదరీమణులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.ఇందుకు సంబంధించిన వార్తలు చైనాలో వైరల్ గా మారాయి. అయితే అత్యంత అధునాతన సాంకేతికత ఉన్న చైనాలో ఇలా జరగం ఆశ్చర్య పరుస్తుంది.












Click it and Unblock the Notifications