coronavirus: ఉదారత చాటుకొన్న ట్వీట్టర్ సీఈవో, రోగుల కోసం బిలియన్ డాలర్ల భారీ విరాళం

ప్రపంచాన్ని భయకంపితులను చేస్తోన్న కరోనా వైరస్‌‌ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. భయాందోళన నెలకొన్న నేపథ్యంలో.. ప్రముఖులు విరాళాలు అందిస్తూ.. ప్రభుత్వాలకు స్వాంతన చేకూరుస్తున్నారు. కరోనా వైరస్‌తో ప్రబలుతోన్న వారికి ట్వీట్టర్ సీఈవో జాక్ డోర్సే భారీ విరాళం ప్రకటించారు. బిలియన్ డాలర్లు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు.

దీంతోపాటు ఆదాయంలో 28 శాతం చారిటీ సంస్థకు అందజేస్తానని పేర్కొన్నారు. తొలుత సార్వత్రిక ప్రాథమిక ఆదాయం, తర్వాత బాలికల ఆరోగ్యం, బాలిక విద్యపై ఫోకస్ చేస్తానని ట్వీట్ చేశారు. వాస్తవానికి జాక్.. తన చారిటిబుల్ నిధుల వివరాలను చాన్నాళ్ల నుంచి గోప్యంగా ఉంచుతున్నారు. కరోనా వైరస్ సందర్భంగా విరాళ ప్రకటించిన తర్వాత ప్రజలకు బహిర్గతం చేశారు. అంతేకాదు తన విరాళాల వివరాలు చూడొచ్చని కూడా పేర్కొన్నారు.

Twitter CEO Jack Dorsey pledges $1 billion of his wealth..

జాక్.. నికర ఆస్తులు 3.3 బిలియన్ డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్ అంచనావేసింది. చారిటీ, ఇతర చెల్లింపుల కోసం ట్వీట్టర్ కాకుంగా స్క్వేర్‌లో తన వాటాను తాకట్టు పెడుతున్నట్టు పేర్కొన్నారు. తర్వాత తాకట్టు పెట్టిన వాటాల అమ్మకాలను వేగవంతం చేస్తానని చెప్పారు. అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. 3 లక్షల 80 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 12 వేల 300కు చేరిందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+