వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు వార్నింగ్: ట్విట్టర్ అకౌంట్ లాక్: ఫేస్‌బుక్ వీడియోలు డిలేట్: ఇంకోసారి ఇలా చేస్తే..!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇంకొద్ది రోజుల్లో మాజీ కాబోతోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సోషల్ మీడియా దిగ్గజ సంస్థల నుంచి చుక్కెదురైంది. ఆయన చేసిన పోస్టింగులు, వీడియోలు డిలేట్ అయ్యాయి. అమెరికా పార్లమెంట్ కేపిటల్ బిల్డింగ్‌ను ఆయన మద్దతుదారులు ముట్టడించడం, వాషింగ్టన్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని పోస్టింగులు వివాదాస్పదం అయ్యాయి. దీనితో ట్విట్టర్, ఫేస్‌బుక్ ఉమ్మడిగా వాటిని తొలగించాయి. ట్విట్టర్ మరో అడుగు ముందుకేసింది. ట్రంప్ అకౌంట్‌ను లాక్ చేసి పడేసింది. 12 గంటల పాటు దాన్ని పునరుద్ధరించే అవకాశాలు లేవని తెలిపింది.

Recommended Video

Joe Biden Confirmed As President-Elect By Electoral College

రక్తసిక్తం: అట్టుడుకుతోన్న వాషింగ్టన్: పార్లమెంట్ భవనం ముట్టడి: కాల్పుల మోత: అల్లకల్లోలంరక్తసిక్తం: అట్టుడుకుతోన్న వాషింగ్టన్: పార్లమెంట్ భవనం ముట్టడి: కాల్పుల మోత: అల్లకల్లోలం

ఫలితంగా- ఆయన ట్విట్టర్ అకౌంట్‌లో ఎలాంటి పోస్టింగులు గానీ, ఇతర కార్యకలాపాలు గానీ కనిపించట్లేదు. వాషింగ్టన్‌లో ఆందోళనకు దిగిన తన మద్దతుదారులను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని సూచనలకు సంబంధించిన సారాంశం ఈ ట్వీట్లలో ఉన్నాయి. వారిని ఉద్దేశించి ట్రంప్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలను ట్రంప్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విషయాన్ని ట్రంప్.. ఈ వీడియో ద్వారా మరోసారి ప్రస్తావించారు.

Twitter locks account of US President Donald Trump for 12 hours following removal of three of his tweets.

తమ నుంచి దొడ్డిదారిన డెమొక్రాట్లు అధికారాన్ని లాక్కున్నారని, ఇలాంటి ఎన్నికల ఫలితాలు.. అమెరికా చరిత్ర, ప్రతిష్ఠను మసకబారేలా చేస్తాయంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎలక్టోరల్ కాలేజ్ కూడా దానికి మద్దతు పలకిందని, దీన్ని చరిత్ర ఎప్పుడూ విస్మరించబోదని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు.. ఆందోళనకారులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నట్టు భావించిన ట్విట్టర్, ఫేస్‌బుక్ యాజమాన్యాలు వాటిని తొలగించాయి. ట్రంప్ చేసిన పోస్టింగులు తమ నిబంధనలు, మార్గదర్శకాలకు భిన్నంగా ఉన్నాయని, అందుకే వాటిని తొలగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాయి.

Twitter locks account of US President Donald Trump for 12 hours following removal of three of his tweets.

వరుసగా మూడు వివాదాస్పద పోస్టింగులను చేయడం వల్ల ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను తాము లాక్ చేయాల్సి వచ్చిందని ట్విట్టర్ వెల్లడించింది. 12 గంటల పాటు దాన్ని లాక్ చేశామని, ఇదే పరిస్థితి మున్ముందు తలెత్తితే.. నిబంధనలకు అనుగుణంగా మరింత లోతుగా చర్యలను తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చని, శాశ్వతంగా ట్రంప్ అకౌంట్‌ను లాక్ చేయడానికి తమకు వీలు కల్పించినట్టవుతుందని పేర్కొంది. హింసను ప్రేరేపించేలా, ఆందోళనకారులను రెచ్చగొట్టేలా ఉండటం వల్లే తాము అకౌంట్‌ను లాక్ చేసిన విషయాన్ని ట్రంప్‌కు వెల్లడించినట్లు తెలిపింది.

English summary
Twitter locks account of outgoing US President Donald Trump for 12 hours following removal of three of his tweets. Facebook removes US President Donald Trump's video addressing his supporters during violence at US Capitol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X