బాధ పెట్టడం ఎందుకని.. ఒకేసారి ఇద్దరు ప్రియురాళ్లను పెళ్లాడాడు!
జకార్తా: ఆ యువకుడు ఇద్దరు అమ్మాయిలను ప్రేమించాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఇతడ్ని చాలా ఇష్టపడుతున్నారు. ప్రేమించుకోవడం అయిపోయింది.. ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, ఒకరిని చేసుకుంటే.. మరొకరికి కోపం వస్తుందని అనుకున్న ఆ యువకుడు ఒకేసారి ఇద్దరినీ పెళ్లి చేసుకుని సమస్యకు పరిష్కారం చూపించుకున్నాడు.

భారీగా కట్నం ఇచ్చుకుని..
ఈ వింత ఘటన ఆగస్టు 17న ఇండోనేషియాలోని కలిమంతన్ ఎయిర్తరప్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పేరు తెలియని ఆ వరుడు తాను వివాహం చేసుకునే ఇద్దరు అమ్మాయిల కుటుంబసభ్యులకు భారీగా కట్నం ఇచ్చుకున్నాడు. ఇండోనేషియా సాంప్రదాయంలో వరుడే వధువుకు కట్నం ఇవ్వాల్సి ఉంటుంది.

ఫొటోలకు ఫోజులిచ్చారు..
ఇద్దరు అమ్మాయిల మధ్య ఆ యువకుడు కొంత ఆందోళనగా కనిపించినా పెళ్లి సంబరం సజావుగా సాగడంతో ఊపిరిపీల్చుకున్నాడు. అతడ్ని వివాహం చేసుకున్న అమ్మాయిలు కూడా.. అతనికి చెరోవైపు ఉండి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం గమనార్హం.

ఎవర్నీ బాధపెట్టకూడదని ఇద్దర్నీ..
తాను ప్రేమించిన ఇద్దరు అమ్మాయిల్లో ఎవర్నీ బాధపెట్టకూడదనే ఆ యువకుడు.. ఆ ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకున్నట్లు స్థానిక మీడియా తన కథనాల్లో వెల్లడించింది.
అమ్మాయిల కుటుంబసభ్యులు కూడా ఈ వివాహాన్ని స్వాగతించడం గమనార్హం.
సాంప్రదాయబద్దంగా పెళ్లిళ్లు..
మూడు కుటుంబాలవారు సానుకూలంగా ఉండటంతో సాంప్రదాయబద్దంగా ఈ పెళ్లిళ్లు జరిగాయి. మూడు కుటుంబాల సభ్యులంతా కలిసి నవ వరుడు, వధువులను ఆశీర్వదించారు. మత పురోహితులు వారి ఆచారం ప్రకారం ఘనంగా వివాహాలు జరిపించారు.












Click it and Unblock the Notifications