పశ్చిమ ఇండోనేషియాలో భూకంపాలు, ప్రకంపనాలతో జనం పరుగులు, 6.8, 6.9 తీవ్రతతో...

పశ్చిమ ఇండోనేషియాలో రెండు శక్తిమంతమైన భూకంపాలు సంభవించాయి. సముద్రగర్భంలో బుధవారం ఉదయం భూమి కంపించింది. భూ ప్రకంపనాలతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత మాత్రం 6.8గా నమోదైంది. సముద్రంలో 10 కిలోమీటర్ల లోతు వరకు భూకంపం ప్రభావం చూపించింది.

Two Powerful Earthquakes Shake Western Indonesia..

బెంగ్‌కులు నగరంలో పశ్చిమ నైరుతి దిశలో 144.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుమత్రా ద్వీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆరు నిమిషాల తర్వాత ఆ ప్రాంత సమీపంలో 6.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. కానీ సునామీ హెచ్చరికలు ఏమీ జారీచేయలేదు అని అధికారులు తెలిపారు. ఉదయం భూమి పదే పదే కంపించిందని స్థానికుడు ఒకరు ట్వీట్ చేశారు. దీంతో తాము ఇంటి నుంచి బయటకు వెళ్లామని పేర్కొన్నారు. 270 మిలియన్ల జనాభా ఉన్న ద్వీపం ఇండోనేషియాలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు, సునామీలు వస్తుంటాయి. అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+