జో బిడెన్ వ్యూహాల వెనుక ఇద్దరు భారతీయ అమెరికన్లు- ఒబామా హయాం నుంచే కీలకం
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలుంది. ప్రచార బరిలో రిపబ్లికన్, డెమోక్రాట్ అభ్యర్ధులు హోరాహోరీగా సాగిపోతున్నారు. ప్రత్యర్ధులపై ఆధిక్యం సాధించాలంటే భారీ వ్యూహాలు తప్పనిసరి. అందులోనూ ఈసారి భారతీయుల పాత్ర గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. దీంతో భారతీయ భాషల్లోనే బ్యాలెట్ పేపర్లు సైతం సిద్ధమైపోతున్నాయి. భారతీయులను ఆకట్టుకునేందుకు అధ్యక్ష అభ్య్రర్ధులు ట్రంప్, బిడెన్ చేయని ప్రయత్నం లేదు.
ఇందులో భాగంగా బిడెన్ అయితే ఏకంగా ఇద్దరు భారతీయ అమెరికన్లనే సలహాదారులుగా నియమించుకున్నారు.
Recommended Video
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్ధిగా ఉన్న జో బిడెన్ ఇద్దరు భారతీయులను తన ప్రధాన సలహాదారులుగా నియమించుకున్నారు. వీరిలో ఒకరు అమెరికా మాజీ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి కాగా మరొకరు హార్డర్డ్ ఆర్ధిక వేత్త రాజ్ చెట్టి. వీరిద్దరూ ప్రధానంగా ఆర్ధికాంశాలపైనే బిడెన్‌కు మార్గదర్శనం చేస్తున్నారు. దీంతో పాటు కరోనా వైరస్ ప్రభావం, ఆర్ధిక వ్యవస్ధ పునరుజ్జీవం, విదేశాంగ విధానంపైనా బిడెన్‌కు సలహాలు అందిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యంపై జరుగుతున్న చర్చల్లో వివేక్ మూర్తి మరో సలహాదారు డాక్టర్ కెస్లర్‌తో కలిసి బిడెన్‌కు సలహాలు అందించారు. వీరిద్దరూ ప్రతీరోజూ తాజా పరిస్ధితిని బిడెన్‌కు వివరిస్తూ చర్చలు ప్రభావవంతంగా సాగేలా చూశారు. ఈ క్రమంలో వీరు కరోనా బారిన కూడా పడ్డారు. అయినా జూమ్ మీటింగ్స్ ద్వారా మూర్తి, కెస్లర్ బిడెన్‌కు సలహాలు, నివేదికలు అందిస్తూ వచ్చారు. మరోవైపు ఆర్ధిక వ్యవస్ద పునరుజ్జీవానికి సంబంధించి హార్డర్వ్ ఆర్ధికవేత్త అయిన రాజ్ చెట్టి కూడా బిడెన్‌కు అద్భుతమైన సలహాలు అందించారు. గత ఏడేళ్లుగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, కరోనా తర్వాత పునరుజ్జీవానికి అవసరమైన చర్యలపై బిడెన్ గతంలో ఫెడరల్ రిజర్వ్ కోసం పనిచేసిన రాజ్‌తో పాటు జానెట్ యెల్లెన్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు.












Click it and Unblock the Notifications