ఆత్మాహుతి: 43మంది మృతి, 240మందికి గాయాలు
బీరుట్: ఆత్మాహుతి దాడులతో లెబానన్ దద్దరిల్లింది. రెండు చోట్ల జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 43 మంది మృతిచెందారు. మరో 240మందికిపైగా గాయపడ్డారు. లెబానన్ రాజధాని బీరుట్‌లో ఈ జంట పేలుళ్లు జరిగాయి. షియా ఇస్లామిక్ సంస్థ హిజ్‌బుల్లాకు పట్టున్న ప్రాంతమైన బుర్జ్ అల్-బరాజేనే ప్రాంతాల్లో జిహాదీలు తమను తాము పేల్చుకున్నారు.
ఆత్మాహుతి దాడులకు పాల్పడింది తామేనంటూ సున్నీ జిహాదీ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. అయితే అధికారులు దీన్ని ఇంకా దృవీకరించలేదు. బీరుట్‌లో 25 ఏళ్ల క్రితం ముగిసిన ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత మొదటిసారి ఇంత భారీ స్థాయిలో విధ్వంసక బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

దాడులను ప్రధాని తమామ్ సలాం ఖండించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష శక్తులన్నీ ఒక్కటి కావాలని ఆయన పిలుపునిచ్చారు. బుర్జ్ వీధిలో ఇద్దరు సుసైడ్ బాంబర్లు చాలా సమీప ప్రాంతంలోనే తమను తాము పేల్చుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
నడుముకు పేలుడు కట్టుకుని వచ్చిన ఓ జిహాదీ.. షియా మసీదు సమీపంలో పేల్చుకున్నాడు. ఆ తర్వాత మరో జిహాదీ సమీప బేకరీలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అయితే ఆత్మాహుతికి పాల్పడాలనుకున్న మూడో వ్యక్తి మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. రెండో పేలుడు ధాటికి మూడో జిహాదీ చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications