సిరియాపై అమెరికా దాడులు: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాకు చెక్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: సిరియాపై అమెరికా బాంబు దాడుల ఘటనపై ఐక్యరాజ్యసమితిలో దోషిగా నిలబెట్టేందుకు రష్యా చేసిన ప్రయత్నం విఫలమైంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా సిరియాపై చేస్తున్న బాంబు దాడుల విషయాన్ని తప్పు అని ఎత్తి చూపేందుకు రష్యా చేసిన ప్రయత్నం ఫెయిలైంది. రష్యా చేసిన తీర్మానం వీగిపోయింది.

సిరియాపై బాంబు దాడుల విషయంలో అమెరికాను ఐక్యరాజ్యసమితిలో దోషిగా నిలబెట్టేందుకు రష్యా చివరివరకు ప్రయత్నం చేసింది. సిరియాపై అమెరికా బాంబుదాడులకు దిగుతోంది. ఇటీవలనే అమెరికా ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాదు ఆచరణలో అమలు చేసింది.

సిరియాపై అమెరికా బాంబు దాడులను నిరసిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సిరియాపై అమెరికా దాడులను నిరసిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా పెట్టిన తీర్మానానికి తొమ్మిది ఓట్లు రావాల్సి ఉండగా, వ్యతిరేకంగా ఎనిమిది దేశాలు ఓట్లు వేశాయి నాలుగు దేశాలు ఓటింగ్ నుండి తప్పుకొన్నాయి. రష్యా ప్రవేశ పెట్టిన తీర్మానం వీగిపోయిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటించింది.

U.N. Security Council Rejects Russian Resolution Condemning Syrian Strikes

ఆయుధాలు సిద్దంగా ఉన్నాయని సిరియాలో మరిన్ని దాడులు తప్పవని అమెరికా ప్రకటించిన సమయంలో రష్యా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సిరియాపై అమెరికా దాడులను బ్రిటన్ సమర్ధించింది. విష వాయువుల దాడులతో సామాన్య ప్రజలు పోగోట్టుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

సిరియాలో పశ్చిమ దేశాల దౌర్జన్యాలను ఆపాలని భవిష్యత్తులో సిరియా విషయంలో జోక్యం చేసుకోకూడదని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను పాటించడం లేదని రష్యా ఆరోపించింది.

అయితే ఈ విషయంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా తాము సిద్దంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. సిరియా పరిస్థితులు అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఇబ్బందిగా మారాయని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After a heated two-hour debate, the United Nations Security Council rejected a Russian resolution on Saturday that would have condemned airstrikes carried out hours earlier by the United States, Britain and France against Syria.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X