వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్‌కు షాక్: ఉ.కొరియాలో బీ-1బీ బాంబులు జారవిడిచిన అమెరికా

By Narsimha
|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియాకు అమెరికా షాకిచ్చింది.ఉత్తరకొరియాలో అమెరికా బీ-1 బీ బాంబులను జారవిడిచింది. ఈ పరిణామంతో ఉత్తరకొరియా బిత్తరపోయింది. అమెరికా, దక్షిణకొరియాలు సంయుక్తంగా కయ్యానికి కాలు దువ్వుతున్నట్టు ఆ దేశాధికారులు భావిస్తున్నారు.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచదేశాల మాటలు వినడం లేదు. అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు.అయితే ఉత్తరకొరియాపై అమెరికా పీకల దాకా కోపంతో ఉంది. ఈ పరిణామాలతో ఉత్తరకొరియాను దెబ్బ కొట్టేందుకు అమెరికా వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది.

అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా ఉత్తర కొరియాపై కయ్యానికి కాలు దువ్వుతున్నాయంటూ ఆ దేశ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం అమెరికా బీ-1బీ బాంబులను నార్త్ కొరియాలోని కొన్ని ప్రదేశాల్లో జారవిడిచి మాక్ డ్రిల్ నిర్వహించినట్లు స్థానిక మీడియా కేసీఎన్ఏ శుక్రవారం ప్రసారం చేసింది.

U.S. Bomber Drills Aggravate North Korea Ahead of Trump's Asia Visit

వరుస క్షిపణి పరీక్షలతో జపాన్, అమెరికా, చైనా దేశాలకు దడ పుట్టిస్తూ ఆయా దేశాధినేతల హెచ్చరికలను నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ బేఖాతరు చేస్తున్నందునే మాక్ డ్రిల్ తో తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశాయి.

అమెరికా, దక్షిణ కొరియాలు యుద్ధ విమానాలతో గువాంలోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ నుంచి తమపై మాక్ డ్రిల్ నిర్వహించాయని, తద్వారా హెచ్చరికలు పంపాలని చూడటంపై నార్త్ కొరియా మండిపడుతోంది. అయితే తమ బలగాలను మోహరించినట్లుగానీ, యుద్ధ విమానలతో దాడులు చేయడానికి సన్నద్ధమైనట్లుగా అమెరికా, దక్షిణ కొరియాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ఆ కథనం ప్రకటించింది.

English summary
A U.S. Air Force B-1B Lancer assigned to the 37th Expeditionary Bomb Squadron, takes-off to fly a bilateral mission with Japanese and South Korea Air Force jets in the vicinity of the Sea of Japan, from Andersen Air Force Base, Guam, October 10, 2017. Senior Airman Jacob Skovo-Lane/U.S. Air Force/Handout via REUTERS Reuters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X