ఆ భేటీపై కిమ్ కన్ను?: మరోసారి అణుప్రయోగం జరిగే ఛాన్స్, అమెరికా హెచ్చరిక..

Subscribe to Oneindia Telugu

ప్యోంగ్‌యాంగ్: ఇన్నాళ్ల మాటల యుద్దానికి ఇక తెరపడబోతుందా? ఇక అమీ తుమీ తేల్చుకునేందుకే ఉత్తరకొరియా సిద్దపడుతోందా?.. ట్రంప్ ఆసియా పర్యటనే దీనికి అనువైన సమయమని భావిస్తోందా?.. ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపరుస్తున్నాయి.

పాట్రిక్ కొన్నిన్ హెచ్చరిక

పాట్రిక్ కొన్నిన్ హెచ్చరిక

ఆసియాలో అడుగుపెడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అణుక్షిపణులతో స్వాగతం చెప్పాలని ఉత్తరకొరియా యోచిస్తున్నట్టుగా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికన్ వైట్ హౌజ్‌లో ఆసియా-పసిఫిక్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ పాట్రిక్ క్రొనిన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.

జపాన్, దక్షిణ కొరియాలలో ట్రంప్ పర్యటిస్తున్న సందర్భంగా ఉత్తరకొరియా అణుదాడికి పాల్పడే ప్రమాదం ఉందని పాట్రిక్ క్రొనిన్ హెచ్చరించారు. ఉత్తరకొరియా కదలికలపై తాము నిఘా పెట్టామని, ఆ దేశాన్ని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు.

 ఆ అవకాశం లేకపోలేదు

ఆ అవకాశం లేకపోలేదు

అమెరికాకు చెందిన మరో సీనియర్ అధికారి, ఫెడరేషన్ ఆఫ్ అమెరికా శాస్త్రవేత్త ఆడం మౌంట్ కూడా అదే విషయాన్ని వెల్లడించాడు. ట్రంప్ జపాన్, దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా ఉత్తరకొరియా మరో అణుప్రయోగం జరిపే అవకాశం ఉందని హెచ్చరించారు.

 గత ఫిబ్రవరిలో..

గత ఫిబ్రవరిలో..

గత ఫిబ్రవరిలో జపాన్ ప్రధాని షింజో అబే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ నేపథ్యంలో ఉత్తరకొరియా అణు ప్రయోగం చేసిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి భేటీ జరుగుతుండటంతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ మదిలో ఏముందనేది అంతుపట్టడం లేదు. ఆసియా దౌత్యవేత్త ఒకరు ఈ భేటీపై స్పందించారు. కిమ్ ఎప్పుడేం చేస్తాడో అంచనా వేయడం అసాధ్యం అని ఆయన చెప్పారు.

 అమెరికా ఎత్తుగడలు

అమెరికా ఎత్తుగడలు

కిమ్ గనుక మరోసారి అణుప్రయోగానికి సిద్దపడితే.. అమెరికా సైతం ఎదురుదాడికి సిద్దంగా ఉంది. రెండు దేశాల మధ్య అణుయుద్దం తలెత్తితే అదే ప్రపంచ వినాశనానికి దారితీసే అవకాశముంది.

అనివార్యంగా అమెరికా మిత్ర దేశాలు కూడా యుద్దంలో దిగే అవకాశాలు ఉండటంతో.. ప్రపంచ దేశాలన్నింటి పైనా దీని ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరకొరియా మిత్ర దేశాలను కట్టడి చేసిన అమెరికా.. అంతర్జాతీయ సమాజం మద్దతు పొందేందుకు బాగానే కసరత్తులు చేస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
White House officials and Asian leaders are worried that North Korea may provoke a crisis in an effort to throw President Donald Trump’s trip to the region off script.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి