లాహోర్ ను విడిచి వెళ్లిపోండి.. ప్రజలకు అమెరికా సంచలన ప్రకటన
భారత్- పాకిస్థాన్ మధ్య యద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. లాహోర్ లోని అమెరికా కాన్సులేట్ లోని ఉద్యోగులు, పౌరులు వెంటనే నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో లాహోర్ లోని తమ దేశ పౌరులు ఎవరైనా ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అమెరికా తెలిపింది.
లాహోర్ నగరంలో పాకిస్థాన్ ఆర్మీ మోహరించిన హెచ్ క్యూ 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రాడార్ లను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. భారత్ తరువాతి టార్గెట్ లాహోర్ అని భావించి తమ పౌరులను అప్రమత్తం చేస్తోంది. ఈ మేరకు అమెరికా పౌరులు తక్షణమే లాహోర్ ను విడిచి వెళ్లిపోవాలని అడ్వైజరీ జారీ చేసింది.
భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరు దేశాల్లో ఉన్న తమ పౌరుల భద్రతపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఇరు దేశాల్లో ఉన్న అమెరికా పౌరులు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వదేశానికి రావచ్చని.. లేదా ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి వెళ్లేందుకూ ఏర్పాట్లు చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా పౌరుల రక్షణే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొంది.
మరోవైపు బుధవారం రాత్రి భారత్‌లోని 15 నగరాలపై పాకిస్థాన్ దాడులు చేపట్టేందుకు యత్నించగా భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయిన S 400 రక్షణ వ్యవస్థలు వాటిపై కౌంటర్ ఎటాక్ జరిపి వాటిని పేల్చేశాయి. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించింది.పాక్ ప్రయోగించిన చాలా ఆయుధాలను S 400 రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసినట్లు రక్షణశాఖ పేర్కొంది.

ఇక బుధవారం రాత్రి భారత్ పై దాడికి యత్నించిన పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. ఈ రోజు ఉదయం పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో వరుసగా పేలుళ్లు చోటు చేసుకుంటున్న క్రమంలో అక్కడి ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మరోవైపు యుద్ధ భయంతో పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజి 7 శాతం పతనమైనట్లు సమాచారం.
ఇక 'ఆపరేషన్ సిందూర్' పేరుతో మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట 44 నిమిషాలకు దాడులు చేపట్టింది. కేవలం 25 నిమిషాల్లోనే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ప్రాంతాల్లో దాడులు చేసింది. భారత్ నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications