అధికారంలో ఉండీ మీరు చేయలేదు.. మేము చేసి చూపిస్తాం
UK elections 2024: పార్లమెంట్ ఎన్నికల కోసం.. బ్రిటన్ సర్వ సన్నద్ధమౌతోంది. ఈ ఎన్నికలు ఎంతో దూరంలో కూడా లేవు. జులై 4వ తేదీన అక్కడ పోలింగ్ షెడ్యూల్ అయింది. భారత్ తరహాలోనే అయిదేళ్లకోసారి ఈ ఎన్నికలు నిర్వహిస్తారక్కడ. మే 30వ తేదీన ప్రస్తుత పార్లమెంట్ రద్దయింది.
650 సీట్లు ఉన్న బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 326. భారతీయ మూలాలు ఉన్న ప్రధానమంత్రి రిషి సునాక్ సారథ్యంలో ప్రస్తుతం కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. 2019 నాటి ఎన్నికల్లో ఈ పార్టీకి దక్కిన సీట్ల సంఖ్య 344. 205 మంది సభ్యుల బలంతో లేబర్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది.

స్కాటిష్ నేషనల్ పార్టీ- 43, లిబరల్ డెమొక్రాట్స్- 15, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ- 7, సిన్ ఫెయిన్- 7 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లో ఎన్నికల ప్రచారపర్వం విస్తృతంగా సాగుతోంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉంది కన్జర్వేటివ్ పార్టీ. బోరిస్ జాన్సన్, థాచర్ మే, డేవిడ్ కామెరాన్, జాన్ మేజర్, మార్గరెట్ థాచర్.. వంటి హేమాహేమీలను అందించిన పార్టీ ఇది.
ఈ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఇక్కడిలాగే అధికార, ప్రతిపక్షాలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటోన్నాయి. మాటలదాడికి దిగుతున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఓ అడుగు ముందుకేసింది. గతంలో కన్జర్వేటివ్ పార్టీ ఇచ్చిన హామీలను తవ్వి తీస్తోంది. వాటిని గుర్తు చేసి మరీ విమర్శలు గుప్పిస్తోంది.
భారత్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటామంటూ ఇచ్చిన హామీని లేబర్ పార్టీ గుర్తు చేసింది. భారత్‌తో ఎఫ్టీఏ కుదుర్చుకుంటామంటూ 2022లో అప్పటి ప్రధామంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఆ ఏడాది దీపావళి నాటికి తీపికబురు ఇస్తామనీ అన్నారు. అది ఇప్పటికీ అమలు కాలేదు. ఈ ఒప్పందాల విలువ 38.1 బిలియన్ యూరోలు.
ఈ హామీ గురించి ప్రశ్నించారు లేబర్ పార్టీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి డేవిడ్ ల్యామీ. ఎన్నో దీపావళిలు వచ్చి వెళ్లినా.. ఇప్పటివరకు భారత్‌తో అధికార కన్జర్వేటివ్ పార్టీ.. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవట్లేదంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎఫ్టీఏ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్‌ను ఆయన ప్రస్తావించారు. ఎఫ్టీఏ దారులు మూసుకుపోలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే- భారత్‌తో ఎఫ్టీఏను కుదుర్చుకోవడంపై నిర్మల సీతారామన్, పియూష్ గోయెల్‌తో సంప్రదింపులు మొదలుపెడతామని అన్నారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ను తమ స్నేహితుడిగా అభివర్ణించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications