వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UK-India Week 2022 : లండన్ లో అట్టహాసంగా ప్రారంభం- సృజనాత్మక పరిశ్రమలపై ఫోకస్

|
Google Oneindia TeluguNews

యూకే కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా గ్లోబల్ ఫోరమ్ (IGF) నిర్వహించే వార్షిక UK-ఇండియా వీక్ 2022 లండన్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. తొలిరోజు భారత్-బ్రిటన్ మధ్య 75 ఏళ్ల సంబంధాలకు ప్రతీకగా ఈ ఏడాది రీఇమేజిన్@75 థీమ్‌ను ప్రతిబింబించే సృజనాత్మక సెషన్‌తో ఈ వీక్ ప్రారంభమైంది.

భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యూకే-ఇండియా వీక్ 2022లో తొలిరోజు.. సృజనాత్మక పరిశ్రమలు-సాంస్కృతిక ఆర్ధిక వ్యవస్ధపై ఇరుదేశాల ప్రతినిధుల మధ్య విస్తత చర్చలు జరిగాయి. అలాగే భారత్, బ్రిటన్ మధ్య ఈ 8 దశాబ్దాల సంబంధాలు, వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన తీరుపై చర్చలు జరిగాయి. ఈ వీక్ లో భారత్, బ్రిటన్ కు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు, పారిశ్రా మికవేత్తలు కూడా పాల్గొంటున్నారు.

ఇండియా గ్లోబల్ ఫోరం వ్యవస్థాపకుడు, సీఈవో కూడా అయిన ప్రొఫెసర్ మనోజ్ లాడ్వా ప్రారంభ ప్రసంగం చేశారు. తాము సహజంగానే 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర్యంపై దృష్టి కేంద్రీకరిస్తున్నప్పటికీ, యూకే , భారత్ మధ్య 75 సంవత్సరాల ఆధునిక, శక్తివంతమైన , దూరదృష్టితో కూడిన సంబంధాల బలోపేతానికి మంచి సందర్భంగా ఆయన అభివర్ణించారు. ఇరుదేశాల మధ్య లోతైన , విభిన్నమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయన్నారు. అవి ఈ విజయవంతమైన భాగస్వామ్యానికి అనేక విధాలుగా నిజమైన హృదయ స్పందనగా ఉన్నాయని కొనియాడారు. అందువల్ల తాము యూకే-ఇండియా వీక్ 2022ని అనేక అవకాశాలతో కూడిన సెమినార్‌తో ప్రారంభించినందుకు సంతోషిస్తున్నట్లు వెల్లడించారు.

UK-India Week 2022 opens in London with creative industries focus

ఈ వీక్ లో యూకే-ఇండియా టుగెదర్ వంటి థీమ్‌లను అన్వేషించడం, సృజనాత్మక పరిశ్రమలలో సహకారానికి అవకాశాలు, సుస్థిరమైన కమ్యూనిటీలను నిర్మించడం, సాంస్కృతిక రంగంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు, లండన్‌లోని నెహ్రూ సెంటర్‌లో నిర్వహించిన సెమినార్ యూకే-భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్న ప్రముఖ స్వరాలు , నిపుణులను ఒకచోట చేర్చిందని చెప్పవచ్చు.

ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఐసీసీఆర్ అధ్యక్షుడు డాక్టర్ వినయ్ సహస్రబుద్ధేతో సంభాషణ సందర్భంగా, భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ మాట్లాడుతూ, "మన చరిత్రను పంచుకోవచ్చు, కానీ అనుభవం , జ్ఞాపకాలు పంచుకోకపోవచ్చు. కానీ తాము భారతీయ దృక్కోణం నుండి చర్చల ద్వారా వాటిని చేరుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతికతను ఉపయోగించి 21వ శతాబ్దపు దృక్కోణం నుండి సమస్యలను చూడటం చాలా ముఖ్యమన్నారు.

సెరెండిపిటీ ఆర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్, వ్యవస్థాపకుడు సునీల్ కాంత్ ముంజాల్ మాట్లాడుతూ కాలంతో పాటు మనం మెచ్చుకునే ఏకైక ఆస్తి ప్రజలే అన్నారు. సంస్కృతిని గ్రహించే అద్భుతమైన సామర్థ్యం, మాయా నాణ్యత ఉందన్నారు. కాబట్టి ఇలాంటి అనుభవాల్ని నిరంతరం స్వీకరించడం ముఖ్యమన్నారు. ప్రపంచానికి అందించే అత్యంత సంపన్నమైన వారసత్వం భారతదేశానికి ఉందని ఆయన తెలిపారు.మన కళలు , చేతిపనులు కాలపరీక్షకు నిలబడగలవని నిరూపించుకోవడం చాలా ముఖ్యమన్నారు. తమ కంపెనీలన్నింటికీ సందేశం ఒకటేనని, ప్రజలందరికీ, అన్ని సమయాలలో న్యాయంగా ఉండటానికి ప్రయత్నించాలని, ప్రభావంతో స్థాయిని నిర్మించాలని ఆన కోరారు.

UK-India Week 2022 opens in London with creative industries focus

నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి మాట్లాడుతూ, ఇప్పటికే యూకే, భారత్ మధ్య సాపేక్షంగా బలమైన సాంస్కృతిక బంధాలు ఉన్నాయన్నారు. రెండు దేశాల్లోని సినిమాలు, పుస్తకాలు, ప్రదర్శన కళలు, అనేక ఇతర సృజనాత్మక పరిశ్రమలు దీనిని విజయవంతంగా నిర్మించాయన్ారు. యూకేలోని భారతీయ ప్రవాసులు , తమ రెండు దేశాల మధ్య సజీవ వారధి కూడా ఒక అద్భుతమైన పాత్ర పోషించిందన్నారు.

బ్రిటీష్ కౌన్సిల్, ఫెస్టివల్స్ అండ్ సీజన్స్ డైరెక్టర్ రెబెక్కా సిమోర్ మాట్లాడుతూ, "భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా బ్రిటిష్ కౌన్సిల్ నిజంగా మన రెండు దేశాల మధ్య సృజనాత్మక పరిశ్రమలలో సహకారానికి మద్దతు ఇవ్వాలనుకుంటోంది" అని అన్నారు. ఈ ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధాల యొక్క అనేక కోణాల వేడుకగా UK-ఇండియా వారాన్ని ఐజీఎఫ్ ఏటా నిర్వహిస్తోంది. 2022 ఎడిషన్ (జూన్ 27 నుండి జూలై 1 వరకు) జరగబోతోంది. ఇందులో వాణిజ్యం, ఆర్థిక మార్పిడి, వాతావరణ చర్య, ఆరోగ్య సంరక్షణ, సాంకేతికత, ఆవిష్కరణ
వంటి అంశాలపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించనున్నారు

English summary
UK-India Week 2022 kicked off in london with creative industries focus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X