కారుణ్య మరణానికి యూకే గ్నీన్ సిగ్నల్..!
యూకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురై.. ఎలాంటి చికిత్సకు స్పందించని వారికి కారుణ్య మరణం(యూథనేషియా) కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు యూకే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. యూకే పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టగా 314 మంది బిల్లును సమర్థించగా.. 291 మంది బిల్లును వ్యతిరేకించారు. దీంతో యూథనేషియా బిల్లు యూకే పార్లమెంట్ లో ఆమోదం పొందింది.
యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడే 18 ఏళ్లు నిండిన వ్యక్తులు కారుణ్య మరణం(యూథనేషియా) పొందేందుకు హక్కును కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు యూకే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్ సభకు వెళ్లింది. ఇక్కడ కూడా బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టంగా మారుతుంది.
యూకేలో 18 ఏళ్లు పైబడిన రోగులు మరో 6 నెలల్లో మృతి చెందబోయో రోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు తాజాగా యూకే పార్లమెంటులో ప్రవేశపెట్టగా 314 మంది బిల్లును సమర్థించగా.. 291 మంది బిల్లును వ్యతిరేకించారు. దీంతో యూథనేషియా బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం 18 ఏళ్లు నిండి.. 6 నెలల కంటే ఎక్కువ రోజులు జీవించే అవకాశం లేని వాళ్లు యూథనేషియాకు అప్లై చేసుకోవచ్చని బిల్లు సారాంశం.

పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందగా.. ఈ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్ సభకు వెళ్లింది. ఇక్కడ కూడా బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టంగా మారుతుంది.












Click it and Unblock the Notifications