వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీవ్‌పై రష్యా దాడులు ఉద్ధృతం : ఉక్రెయిన్‌కు అండగా నాటో.. అణు వార్‌హెడ్లు రెడీ చేసిన యూకే !!

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌లోని కీలక నగరాలను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా దాడులను మమ్మురం చేసింది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకునేందుకు గత 26 రోజులుగా దాడులు చేస్తున్నా పట్టుసాధించడంలో విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో క్షిపణుల ప్రయోగాన్ని మరింత పెంచాలని నిర్ణయించింది. ఈమేరకు దాడుల తీవ్రతరం చేసింది. కీవ్ నగరాన్ని రష్యా దళాలు చుట్టుముట్టాయి. ఓ షాపింగ్ సెంటర్‌పై ఫిరంగులతో దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందారు. షాపు సెంటర్ పూర్తిగా ధ్వంసమైంది.

ర‌ష్యా బాంబుల మోత‌

ర‌ష్యా బాంబుల మోత‌

ఉక్రెయిన్‌లోని ఏ నగరంలో చూసినా భయానక పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. బాంబుల మోతతో జనం బెంబెలెత్తిపోతున్నారు. ఒకవైపు ద్వంసమైన సుందర భవనాలు.. రోడ్లపై శవాలు.. మరోవైపు సామాన్య ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. రష్యా సేనలు మరియుపోల్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ బలగాలు లొంగిపోవాలని రష్యా హెచ్చరించింది. అయితే రష్యా సేనల హెచ్చరికలను మరియుపోల్ తిరస్కరించింది. లొంగిపోయే ప్రసక్తి లేదని రష్యాకు ఉక్రెయిన్ తేల్చిచెప్పింది. చివరి వరకు తమ పోరాటం ఆపేది లేదని.. ప్రతిఘటిస్తుంటామని స్పష్టంచేసింది.

 డ్రోన్లతో ర‌ష్యా సేన‌ల‌పై దాడులు..

డ్రోన్లతో ర‌ష్యా సేన‌ల‌పై దాడులు..


రష్యా దాడులను ఉక్రెయిన్ దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 14700 మంది రష్యా సైనికులను హతమార్చారు. రష్యా దళాలపై దాడులను తీవ్రతరం చేసింది. యూరప్ దేశాలు పంపిన ఆయుధాలతో పాటు టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లను సమర్థవంతంగా వినియోగిస్తోంది. వీటితో రష్యన్ల యుద్ధ కాన్వాయ్‌లపై ప్రతిదాడులకు దిగుతోంది. వాటిని ధ్వంసం చేస్తోంది. ఇప్పటికే రష్యాకు చెందిన పలు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ సేనలు నాశనం చేశారు. ఉక్రెయిన్ వద్ద టర్కీ నుంచి కొనుగోలు చేసిన 50 వరకు డ్రోన్లు ఉన్నాయి.

అణు వార్ హెడ్ల‌ను బ‌య‌ట‌కు తీసిన యూకే

అణు వార్ హెడ్ల‌ను బ‌య‌ట‌కు తీసిన యూకే


ఉక్రెయిన్‌పై దాడుల్లో భాగంగా అత్యంత శక్తివంతమైన కింజల్ హైపర్ సోనిక్ క్షిపణులను రష్యా రంగంలోకి దించింది. వాటిని నగరాలపై ప్రయోగిస్తోంది. దీంతో భవిష్యత్తులో వ్యూహాత్మక అణ్యాయుధాలు కూడా వాడే ప్రమాదం ఉందన్న భయాలు వెంటాడతున్నాయి. యూరప్ , నాటో దేశాల్లో అణు భయాలు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్‌కు ఆయుధ సామాగ్రి సాయాన్ని పలు దేశాలు అందిస్తున్నాయి. తాజాగా నాటో సభ్య దేశమైన యూకే తన ట్రైడెంట్ ఖండాంతర క్షిపణులను అమర్చే అణు వార్ హెడ్లను ట్రక్కులపై ఉంచి కీలక ప్రాంతాలకు తరలించింది. ఈ క్షిపణులను సబ్ మెరైన్ల నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. ఏక పక్షంగా వ్యవహరిస్తున్న రష్యాను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించాయి.

English summary
UK ready for nuclear warheads over Russia-Ukraine war
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X