ఉక్రెయిన్ పార్లమెంటు వద్ద పేలుడు: 100మందికి గాయాలు
కీవ్: ఉక్రెయిన్ పార్లమెంటు ఎదుట సోమవారం బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు మృతి చెందగా, మరో 100మంది పోలీసులు, జర్నలిస్టులు సహా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేర్పాటువాద ప్రాంతాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం పట్ల పార్లమెంటు వద్ద పలువురు ఆందోళనకారులు ఆందోళన చేస్తున్న సమయంలో బాంబు పేలుడు సంభవించింది.

మరో పురాతన ఆలయం నేల మట్టం
పామిరా: దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర గల మరో ఆలయం కాల గర్భంలో కలిసిపోయింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు సిరియాలోని చరిత్రాత్మక నగనం పామిరాలో మరో బాల్ ఆలయాన్ని కూల్చి వేశారు.
బాంబులు పెట్టి కూల్చినట్లు సమాచారం. బాంబులు పేలినపుడు వెలువడిన శబ్ధాలు చెవికి చిల్లులు పడే విధంగా ఉన్నయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అదొక భారీ విస్ఫోటమని స్థానికుడొకరు చెప్పారు. ఆలయం ధ్వంసం సమయంలో ఏర్పడిన దుమ్ము దూళి భారీగా ఎగసి పడినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఆలయం క్రీ.శ. 32లో నిర్మించబడింది.












Click it and Unblock the Notifications