కూలిన విమానం: 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు, ఏడుగురు రష్యన్లు మృతి, ఉక్రెయిన్ పనేనంటూ రష్యా
మాస్కో: యుద్ధం కొనసాగుతున్న తరుణంలో తాజాగా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా విమానం నేలకూలింది. ఇందులో ప్రయాణిస్తున్న 74 మంది మృతి చెందినట్లు రష్యా అధికారులు తెలిపారు. సైనిక రవాణా విమానం ఇలియుషిన్-76లో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ దాడులు చేసి ఈ విమానాన్ని కూల్చిందని రష్యా ఆరోపిస్తోంది.
కాగా, ఉక్రెయిన్ సమీపంలోని బెల్గోరోడ్‌లో ఈ దుర్ఘటన జరిగిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి గల కారణాలను గుర్తించేందుకు స్పెషల్ మిలిటరీ కమిషన్ ఘటనా స్థలానికి వెళ్తోందని తెలిపింది. ఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్ ఖైదీలను బెల్గోరాడ్ ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు.

అయితే, ఆ విమానంలో యుద్ధ ఖైదీలను తరలించట్లేదని S-300 రక్షణ వ్యవస్థకు చెందిన క్షిపణులు తరలిస్తున్నారని ఉక్రెయిన్ ఆరోపణ చేసింది. ఉక్రెయిన్ దళాలే ఈ విమానాన్ని నేలకూల్చినట్లు రష్యా పార్లమెంట్ స్పీకర్ ఆరోపించారు. కాగా, విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
🚨 💥 BREAKING: Ukrainian Armed Forces sources confirm the shooting down of a Russian IL-76 military plane transporting S-300 missiles over Belgorod region in Russia.
— Igor Sushko (@igorsushko) January 24, 2024
The rumor of Ukrainian POWs being on board the plane is FALSE. pic.twitter.com/2GtszJYI8v
ప్రమాదానికి ముందు విమానం అదుపుతప్పి వేగంగా కిందికి పడిపోతున్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత ఇది నివాస ప్రాంతాల వద్ద నేలను తాకింది. దీంతో ఒక్కసారిగా విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. సైనిక రవాణా విమానం ఇలియుషిన్-76 (IL-76)లో బలగాలు, సరకులు, సైనిక సాధనాలను తరలించే వీలుంది.












Click it and Unblock the Notifications