వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్-రష్యా యుద్ధం: రష్యా హెచ్చరిస్తున్నా.. నాటోలో చేరే ఆలోచనలో పలు యూరప్ దేశాలు

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత ప్రపంచ దేశాలలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ దేశాలు విడివిడిగా ఉన్నప్పటికీ కలిసి ఉంటూ అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసిన తరువాత క్రమంగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఎప్పుడూ లేనంత అసౌకర్యానికి కొన్ని యూరప్ దేశాలు గురవుతున్నాయి.

రహస్య స్థావరంలోకి పుతిన్ ఫ్యామిలీ, వారి కోసం లేటెస్ట్ టెక్నాలజీతో సైబీరియాలో బంకర్రహస్య స్థావరంలోకి పుతిన్ ఫ్యామిలీ, వారి కోసం లేటెస్ట్ టెక్నాలజీతో సైబీరియాలో బంకర్

నాటోలో చేరాలని చూస్తున్న పలు యూరోపియన్ దేశాలు

నాటోలో చేరాలని చూస్తున్న పలు యూరోపియన్ దేశాలు


కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్ధిక పరిస్థితులు గందరగోళంగా తయారైన నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న రష్యా దాడి ఇప్పుడు అనేక దేశాలను ఆలోచించేలా చేస్తున్నాయి. యూరోప్ లోని చాలా దేశాలు నాటో భద్రత గొడుగు కింద ఉండడం వల్ల ఎక్కువ భాగం సురక్షితంగా ఉన్నాయి. ఇక పుతిన్ కఠోరమైన నిర్ణయమైన అణు దాడుల నేపథ్యంలో నాటో రక్షణ కవచంలో లేని యూరోపియన్ దేశాలు నాటోలో చేరాలని ఆలోచిస్తున్నాయి. మరోపక్క రష్యా హెచ్చరికల నేపథ్యంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాయి.

స్వీడన్ ఫిన్లాండ్ లకు నాటోలో చేరాలని యూఎస్ సెనేట్ రిపబ్లికన్ మైనార్టీ నాయకుడి ఆహ్వానం

స్వీడన్ ఫిన్లాండ్ లకు నాటోలో చేరాలని యూఎస్ సెనేట్ రిపబ్లికన్ మైనార్టీ నాయకుడి ఆహ్వానం


తాజా పరిణామాల నేపద్యంలో స్వీడన్ మరియు ఫిన్లాండ్ సిద్ధంగా ఉంటే నాటో లోచేరాలని యూఎస్ సెనేట్ రిపబ్లికన్ మైనారిటీ నాయకుడు మిచ్ మెక్‌కానెల్ చెప్పారు. "స్వీడన్ మరియు ఫిన్లాండ్, రెండు దేశాలు నాటో కి చెందనివి. ఈ రెండు దేశాలు చేరడం గురించి ఆలోచిస్తున్నాయని, వారు చేరడానికి సిద్ధంగా ఉంటే మనం రేపు సైన్ అప్ చేయాలని తాను భావిస్తున్నాను" అని మెక్‌కానెల్ కొత్త సమావేశంలో చెప్పారు.

ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపధ్యంలో నాటో సభ్యత్వంపై దేశాల ఆసక్తి

ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపధ్యంలో నాటో సభ్యత్వంపై దేశాల ఆసక్తి


శుక్రవారం ఉక్రెయిన్ మరియు చుట్టుపక్కల పరిస్థితులపై నాటో వర్చువల్ సమ్మిట్‌కు హాజరు కావాలని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ గురువారం స్వీడన్ మరియు ఫిన్‌లాండ్‌లను ఆహ్వానించారు. అదే రోజు, ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్ మాట్లాడుతూ, "జాతీయ భద్రత సమస్య తీవ్రమైతే" ఫిన్లాండ్ నాటోలో చేరడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక కార్యకలాపాల ఫలితంగా నాటో సభ్యత్వంపై దేశాల ఆసక్తి ఉద్భవించింది. డాన్‌బాస్ ప్రాంతంలో స్వీయ-ప్రకటిత రిపబ్లిక్‌ల రక్షణలో దేశాన్ని, సైన్యాన్ని నిర్వీర్యం చేయడం మరియు నాజీల రహితంగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు.

స్వీడన్, ఫిన్లాండ్ కు రష్యాతో తలనొప్పి

స్వీడన్, ఫిన్లాండ్ కు రష్యాతో తలనొప్పి

స్వీడన్, ఫిన్‌లాండ్‌లు నాటో సభ్యత్వం తీసుకుంటే మాస్కో స్పందించాల్సి ఉంటుందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా శుక్రవారం హెచ్చరించారు. ఆస్ట్రియా, ఐర్లాండ్, సైప్రస్ ..మాల్టాతో పాటు, ఫిన్లాండ్ ..స్వీడన్ ఇంకా నాటోలో సభ్యత్వం లేని రెండు యూరోపియన్ యూనియన్ రాష్ట్రాలు.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి, రెండు దేశాలు సైనికపరంగా తటస్థంగా ఉన్నాయి. స్వీడన్ రష్యాతో సరిహద్దును పంచుకోలేదు. స్వీడన్, రష్యా బాల్టిక్ సముద్రంలో గోట్లాండ్ ద్వీపంపై విడిపోయాయి. ఇది తరచుగా మాస్కో సైనిక చర్యకు లక్ష్యంగా మారుతుంది.

 నాటో సభ్య దేశాల సైనిక సహకారం కోసమే నాటోపై ఆసక్తి

నాటో సభ్య దేశాల సైనిక సహకారం కోసమే నాటోపై ఆసక్తి

ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగుతున్న దండయాత్రను స్వీడన్ తీవ్రంగా ఖండిస్తోంది. రష్యా చర్యలు యూరోపియన్ భద్రతా క్రమంలో కూడా దాడిగా పేర్కొంటుంది. ప్రస్తుతం ఈ దేశాలు కూడా రష్యా విషయంలో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో రష్యా విస్తరణను అడ్డుకోవాలన్న లక్ష్యంతో నాటో రూపుదిద్దుకోవడం తో నాటో కూటమి లో చేరాలనుకుంటున్న దేశాలపై రష్యా తీవ్ర ఆగ్రహంతో ఉంది. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో రష్యా తో ప్రమాదం ఉన్న అనేక దేశాలు నాటో లో చేరడం పై ఆలోచనలో ఉన్నాయి. నాటో లో సభ్యత్వం తీసుకుంటే ఒకవేళ రష్యా దాడి చేస్తే నాటో సభ్యత్వ దేశాల సైనిక సహకారం అందుతుందని భావిస్తున్నాయి.

English summary
European countries plans to join NATO after Russia's invasion of Ukraine. Sweden and Finland, which have problems with Russia, have turned their attention to NATO. on the other hand, is in a dilemma in the wake of the Russia warnings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X