ఉక్రెయిన్ విమానం కాబుల్‌లో హైజాక్ అయిందంటూ ఆరోపణలు.. నిజం కాదన్న ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ

అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న తమ దేశ పౌరులను తీసుకెళ్లేందుకు వెళ్లిన ఉక్రెయిన్ విమానం హైజాక్‌కు గురయిందని వార్తలొచ్చాయి. అయితే, ఆ వార్తలు నిజం కాదని ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
ఈ విమానాన్ని కాబుల్ నుంచి ఇరాన్‌కు హైజాక్ చేసినట్లు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ డిప్యూటీ మంత్రి యెవ్‌జెనీని తొలుత తెలిపారు.
విమానాన్ని ఆదివారమే హైజాక్ చేశారని.. మంగళవారం దాన్ని ఇరాన్ తీసుకెళ్లారని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్‌జెనీని ఉటంకిస్తూ రష్యా వార్తాఏజెన్సీ టాస్ చెప్పింది.
మరోవైపు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి ఓలె నికోలింకో ఆ వార్తను ఖండించారు. విమానం హైజాక్ నిజం కాదని ప్రకటించారు.
దీనిపై ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
83 మందితో వచ్చిన మిలటరీ కార్గో విమానం ఒకటి ఉక్రెయిన్ రాజధానికి చేరిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ విమానం ఆదివారమే కాబుల్ నుంచి ఉక్రెయిన్ చేరుకుందని అందులో ఉన్న 83 మందిలో 31 మంది ఉక్రెయిన్ పౌరులు ఉన్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌కు 'కాబుల్ కసాయి' హిక్మత్యార్ ఇచ్చిన సలహా ఏంటి?
- బీజేపీకి రూ.2.5 వేల కోట్ల విరాళాలు.. ఎలక్టోరల్ బాండ్లపై మళ్లీ తలెత్తుతున్న ప్రశ్నలు
- భారతదేశంలోని 'అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications