రష్యాను చావుదెబ్బ కొట్టిన ఉక్రెయిన్.. డ్రోన్ల దాడితో 40 యుద్దవిమానాలు..!
దాదాపు మూడేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటివరకూ ఉక్రెయిన్ పై నిరంతర దాడులతో తీవ్రంగా దెబ్బతీస్తున్న రష్యాకు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఏకంగా 40కి పైగా యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ రష్యా ఎయిర్ బేస్ పై జరిపిన దాడిలో భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా కూడా నిర్ధారించింది.
రష్యా ప్రయోగిస్తున్న మిస్సైళ్ల దాడులకు డోన్లతో జవాబు చెప్తూ వస్తున్న ఉక్రెయిన్ ఇవాళ ఉన్నట్లుండి వందల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దు నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యాలోని తూర్పు సైబీరియాలోని ఒక వైమానిక స్థావరంపై డ్రోన్లతో దాడి చేసింది. ఇర్కుట్స్క్ ప్రాంత రష్యన్ గవర్నర్ ఈ దాడిని ధృవీకరించారు కూడా. ఉక్రెయిన్ ప్రయోగించిన రిమోట్-పైలట్ విమానం శ్రీద్ని గ్రామంలోని సైనిక యూనిట్‌పై దాడి చేసిందని తెలిపారు.

Ukraine is conducting a “large-scale” drone attack against the Russian air force, hitting more than 40 bomber aircraft at 4 bases deep inside Russia, security sources say. It’s one of the biggest operations of its kind - and a huge breach of Putin’s defences⬇️
— Deborah Haynes (@haynesdeborah) June 1, 2025
With @safarov_ pic.twitter.com/eT7eiLURXG
రష్యాపై ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఎస్బీయూ చేసిన అతి పెద్ద దాడి ఇదేనని భావిస్తున్నారు. ఈ దాడిలో రష్యా వైమానిక స్థావరంలో ఉన్న 40కి పైగా యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ మీడియా తెలిపింది. అలాగే రాయిటర్స్ కూడా SBU దాడుల్లో ఒలెన్యా, బెలాయాలోని వైమానిక స్థావరాలతో సహా నాలుగు రష్యన్ సైనిక వైమానిక స్థావరాలను ఏకకాలంలో తాకాయని వెల్లడించింది. ఈ దాడిలో ధ్వంసమైన విమానాలలో టీయూ-95, టీయూ-22ఎం3 బాంబర్లు, ఓ ఏ-50 విమానం కూడా ఉన్నాయని తెలిపింది. తమపై దాడులు చేస్తున్న శత్రు బాంబర్లను నాశనం చేయడమే ఈ దాడి లక్ష్యమని ఉక్రెయిన్ తెలిపింది.
ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ మధ్యవర్తిత్వం చేసిపెడతానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ట్రంప్ ఉక్రెయిన్ కు కంటగింపుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ స్వతంత్రంగానే ఈ దాడి చేసిందా అన్న చర్చ జరుగుతోంది.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications