వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనావాసాలపై రష్యా రాకెట్లు: ఉక్రెయిన్ నటి మృతి: యుద్ధం ఆపాలంటూ ష్క్వార్జ్‌నెగ్గర్ అప్పీల్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య 23 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పట్లో ఇది ఆగేలా కనిపించట్లేదు. యుద్ధాన్ని నిలిపి వేయాలంటూ అంతర్జాతీయంగా వస్తోన్న ఒత్తిళ్లను రష్యా లెక్క చేయట్లేదు. తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే- సరిహద్దులకు ఆనుకుని ఉన్న కీలక పట్టాలపై రష్యా పట్టు బిగించింది. మరియోపోల్, ఖేర్సన్, ఖార్కీవ్, చెర్న్‌హీవ్, వొల్నోవాఖా, ఒడెస్సా.. వంటి పలు నగరాలను స్వాధీనం చేసుకుంది.

కీవ్‌ను వశం చేసుకోలేకోతున్న రష్యా..

కీవ్‌ను వశం చేసుకోలేకోతున్న రష్యా..

రాజధాని కీవ్ కోసం రష్యా సైనిక బలగాలు ఎడతెరిపి లేకుండా పోరాటాన్ని సాగిస్తోన్నాయి. ఆ నగరంపై విరుచుకుపడుతున్నాయి. సరిహద్దు నగరాలపై పట్టును కోల్పోయినప్పటికీ- కీవ్‌ను కాపాడుకునే విషయంలో ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. రష్యా బలగాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. కీవ్ నగరాన్ని చుట్టుముట్టిన రష్యా సైనిక బలగాలను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. దాడులను తిప్పి కొడుతోంది.

దాడులు తీవ్రం..

దాడులు తీవ్రం..

ఈ పరిణామాలతో రష్యా సైనిక బలగాలు అసహనానికి గురైనట్లు కనిపిస్తోన్నాయి. జనావాసాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్లను సంధిస్తోన్నాయి. అపార్ట్‌మెంట్లపై బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. ఈ దాడుల్లో ఉక్రెయిన్ నటి ఒక్సానా ష్వెట్స్ మరణించారు. ఆమె ృతి చెందిన విషయాన్ని యంగ్ థియేటర్ అనే ట్రూప్ నిర్ధారించింది. ఈ ట్రూప్ తరఫున ఒక్సానా పలు నాటకాల్లో నటించారు. ఒక్సానా నివసిస్తోన్న భవనాన్ని రష్యన్ రాకెట్లు ధ్వంసం చేశాయని, ఈ ఘటనలో ఆమె మరణించారని యంగ్ థియేటర్ ట్రూప్ తెలిపింది.

హాలీవుడ్ సినిమాల్లో..

హాలీవుడ్ సినిమాల్లో..

నాటకాలతో పాటు పలు ఉక్రెయిన్, కొన్ని హాలీవుడ్ సినిమాల్లో ఒక్సానా నటించారు. టుమారో విల్ బీ టుమారో, ది సీక్రెట్ ఆఫ్ సెయింట్ ప్యాట్రిక్స్, ది రిటర్న్ ఆఫ్ ముఖ్తార్ సినిమాల్లో నటించారు. ది హౌస్ విత్ లిలీస్ అనే టీవీ షో మెరిశారు. 1955లో జన్మించిన ఒక్సానా కేరీర్ ఆరంభంలో ఇవాన్ ఫ్రాంకో థియేటర్, కీవ్ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్‌తో అసోసియేట్ అయ్యారు. 1980లో యంగ్ థియేటర్ ట్రూప్‌లో చేరారు. ఉక్రెయిన్ ప్రభుత్వం తరఫున పలు అవార్డులను అందుకున్నారు.

రష్యా దాడుల్లో ప్రముఖులు మృతి

రష్యా దాడుల్లో ప్రముఖులు మృతి


రష్యా సైనిక బలగాలు చేస్తోన్న భీకర దాడుల్లో ఇప్పటికే పలువురు ప్రముఖులు మరణించారు. ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్ పియర్రె జక్రెవ్‌స్కీ, ఉక్రెయిన్‌కు చెందిన సీనియర్ కరెస్పాండెంట్ ఒలెగ్జాండ్రా కువ్‌షినోవా విధి నిర్వహణలో ఉంటూ తుదిశ్వాస విడిచారు. సాధారణ పౌరులు చాలామంది అసువులు బాశారు. కర్ణాటకకు చెందిన నిఖిల్ శేఖరప్ప అనే మెడికో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహం ఇంకా భారత్‌కు చేరాల్సి ఉంది.

ఆర్నాల్డ్ అప్పీల్..

ఆర్నాల్డ్ అప్పీల్..

23 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం పట్ల ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, కండలవీరుడు ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగ్గర్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని నిలిపి వేయాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అప్పీల్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రష్యా ప్రజలను తాను ప్రేమిస్తున్నానని, అందుకే నిజం ఏమిటో తెలియజేయాలనుకుంటున్నానని అన్నారు. ప్రపంచం మొత్తం రష్యాకు వ్యతిరేకంగా నిలిచిందని, భవిష్యత్తులో రష్యన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆర్నాల్డ్ చెప్పారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో..

మొదటి ప్రపంచ యుద్ధంలో..

తన తండ్రి గుస్తావ్ ష్క్వార్జ్‌నెగ్గర్ నాజీల తరఫున మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. యుద్ధం మిగిల్చిన విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన కుటుంబం తనదని అన్నారు. యుద్ధం దుష్ప్రభావం తమను సుదీర్ఘకాలం పాటు వెంటాడిందని చెప్పారు. రష్యన్ ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తోన్నప్పటికీ.. అక్కడి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు నష్టపోవాల్సి వస్తోందని చెప్పారు. యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆయన పుతిన్‌కు అప్పీల్ చేశారు.

English summary
Ukrainian actor Oksana Shvets killed in Russian rocket attack. Arnold Schwarzenegger appeals to Russian President Vladimir Putin to stop war in Ukraine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X