ఎమర్జెన్సీ మీటింగ్ : సిరియా స్థితిగతులపై ఐరాస కీలక భేటీ
న్యూయార్క్ : సిరియా వైమానిక దాడులపై చర్చించేందుకు నేడు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యంత కీలక సమావేశం జరగనుంది. అలెప్పోలో ఉన్న 990 మంది సంఘవిద్రోహులను మట్టుపెట్టేందుకు అమాయకులైన 2,75,000 మంది అమాయకుల ప్రాణాలో చెలగాటమాడుతున్నారంటూ సిరియా ప్రత్యేక రాయబారి స్టఫాన్ డీ మిస్తుర వాపోయారు.

కాగా, ఇప్పటికే అమెరికా, రష్యా వైమానిక దాడులతో అలెప్పో నగరం తీవ్రంగా ప్రభావితమైంది. అలెప్పోలో ఉన్న ఉద్రిక్తతలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చి ఘర్షణ పరిస్థితిని వెంటనే రూపుమాపాల్సిన అవసరముందని స్టఫాన్ ఢీ ఐరాసకు విన్నవించారు. తాజా సమావేశంలో దాడుల ను నిలిపేయడానికి ఓ ముసాయిదా తీర్మానాన్ని ఐరాస ప్రవేశపెట్టవచ్చునన్న వాదనలు వినిపిపస్తున్నప్పటికీ.. దాడులు ఆపేందుకు రష్యా అంగీకరిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకమే.












Click it and Unblock the Notifications