యూఎన్ మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తప్పించిన యూఎన్‌జీఏ: ఓటింగ్‌కు భారత్ దూరం
గ్టన్: ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాకు మరో షాక్ తగిలింది. ప్రపంచ మానవ హక్కుల మండలి నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ 193 మంది సభ్యులతో కూడిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, ఈ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.
తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు ఓటు వేయగా, వ్యతిరేకంగా 24 దేశాలు ఓటు వేశాయి. 58 దేశాలు గైర్హాజరయ్యాయి. UNHRCలో రష్యా ప్రస్తుత సభ్యత్వం డిసెంబర్ 2023లో ముగియాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఏ శాశ్వత సభ్యునికి కూడా ప్రపంచ సంస్థలోని ఏ విభాగం నుంచి సభ్యత్వాన్ని రద్దు చేయకపోవడం గమనార్హం.

గత వారం ఉక్రేనియన్ నగరం బుచా వీధుల్లో పడి ఉన్న శవాల భయంకరమైన చిత్రాలు వెలువడిన తర్వాత యూఎస్ ఈ ఓటును ప్రారంభించింది. పట్టణంలో ఒక సామూహిక సమాధి కూడా కనుగొనబడింది, నివాసితులు కనీసం 400 మందిని అక్కడ ఖననం చేసినట్లు వారు భావిస్తున్నారు.
కాగా, "ఈ రోజు UN జనరల్ అసెంబ్లీలో ఆమోదించబడిన మానవ హక్కుల మండలి నుంచి రష్యన్ ఫెడరేషన్ సస్పెన్షన్‌కు సంబంధించిన తీర్మానానికి భారతదేశం దూరంగా ఉంది" అని UNలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు.
UN General Assembly suspends Russia from Human Rights Council
— ANI (@ANI) April 7, 2022
93 countries voted in favour of the draft resolution, 24 countries voted against it, 58 countries abstained pic.twitter.com/Glt34LrFOm
"ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి, భారతదేశం శాంతి, చర్చలు, దౌత్యం కోసం నిలబడింది. రక్తం చిందించడం, అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టడం ద్వారా ఎటువంటి పరిష్కారం లభించదని మేము నమ్ముతున్నాము. భారతదేశం ఏదైనా పక్షాన్ని ఎంచుకుంటే, అది శాంతి పక్షమే, హింసను తక్షణమే అంతం చేయడం కోసమే అని టీఎస్ తిరుమూర్తి స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ నగరమైన బుచాలో పౌర హత్యలు "తీవ్రమైన ఆందోళనకరమైన" నివేదికలను న్యూఢిల్లీ ఖండించిందని, స్వతంత్ర దర్యాప్తు కోసం పిలుపునిచ్చిందని తిరుమూర్తి తెలిపారు.
'మేము అధ్వాన్నమైన పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందుతూనే ఉన్నాము. అన్ని శత్రుత్వాలకు ముగింపు పలకాలనే మా పిలుపును పునరుద్ఘాటిస్తున్నాము. అమాయక మానవ జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పుడు, దౌత్యం మాత్రమే ఆచరణీయమైన ఎంపికగా ఉండాలి" అని తిరుమూర్తి అన్నారు.
కాాగా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి తమను తప్పించడం అక్రమమని రష్యా ఆరోపిస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications