9 మంది పాకిస్తానీయుల కాల్చివేత: తీవ్ర ఉద్రిక్తత
Iran-Pakistan crisis: ఇరాన్- పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తత మరింత పెచ్చరిల్లింది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, దాడులు- ప్రతిదాడుల వ్యవహారం విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. సాధారణ ప్రజల ప్రాణాలను సైతం బలి తీసుకునే స్థాయికి చేరుకుంది.
కొద్దిరోజుల కిందటే పాకిస్తాన్‌పై ఇరాన్ దాడులను చేపట్టిన విషయం తెలిసిందే. ఆ దేశ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. బలూచిస్తాన్ ప్రాంతంలోని సిస్టాన్, పంజ్గూర్‌పై ప్రధానంగా ఇరాన్ దాడులు సాగాయి అప్పట్లో. ఆఫ్ఘనిస్తాన్- ఇరాన్ సరిహద్దులకు ఆనుకుని ఉండే ఈ ప్రాంతం జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు కేంద్రబిందువుగా చెబుతుంటారు.

ఈ ఉగ్రవాద సంస్థ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. డ్రోన్లతో బాంబుల వర్షాన్ని కురిపించింది. మిస్సైళ్లను సంధించింది. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంది పాకిస్తాన్. ఇరాన్‌పై ప్రతిదాడులను జరిపింది. దీనితో ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
తాజాగా- ఇరాన్‌లోని సరావన్ టౌన్‌లో నివసిస్తోన్న తొమ్మది మంది పాకిస్తానీయులను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. వారందరూ రోజువారీ కార్మికులు. జీవనోపాధి కోసం ఇరాన్‌కు వెళ్లిన వలస కార్మికులు. స్థానికంగా ఉండే ఓ కార్ మెకానిక్ షెడ్‌లో పని చేస్తుండేవారు. సరావన్‌కు ఇరాన్ దేశస్తుడొకరు వారిపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించాడు. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు.
ఈ ఘటనను ఇరాన్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం నిర్ధారించింది. దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఆ కుటుంబాల వారిని ఆదుకుంటామని పాకిస్తాన్ రాయబారి మహ్మద్ ముదస్సిర్ టిపు చెప్పారు.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అన్ని విధాలుగా తాము సహకరిస్తామని ఇరాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి మృతదేహాలను స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
-
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
VIRAL: ధురంధర్ 2 కలెక్షన్స్ లో 80 శాతం మాకు ఇవ్వండి: పాకిస్థాన్ ప్రజల డిమాండ్ -
"పాకిస్థాన్ లో నిద్రలేచిన నరరూప రాక్షసులు.. భారత్ కు పెను ముప్పు" -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
కదనరంగంలో కాలు పెట్టిన అమెరికా మెరైన్ మెరికలు- ఇరాన్ యుద్ధం తీవ్రం -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications