
ఎల్ఏసీ వెంట ఏకపక్ష మార్పులు సహించబోం: జై శంకర్
వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి మార్పులను సహించబోమని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. తూర్పు లడాఖ్ వద్ద స్టేటస్ కో యధాతథ స్థితి కొనసాగుతోందని స్పష్టంచేసింది. బుధవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశం అయ్యారు. తజకిస్తాన్ లో జరుగుతున్న షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో వీరిద్దరూ మీట్ అయ్యారు. గంటపాటు సమావేశం జరగగా.. ఈ సందర్భంగా భారత్ వైఖరిని మరోసారి జై శంకర్ ఉద్ఘాటించారు.
నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితుల గురించి మిలిటరీ చర్చలకు ఇరువరు అంగీకరించారు. అన్నీ అంశలాలపై ఇరువరు సమ్మతి తెలిపి.. పరస్పరం ఆమోదయోగ్యం అయిన పరిష్కారం కనుగొనడంపై దృష్టిసారిస్తామని జై శంకర్ తెలియజేశారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తను పెంచే చర్యలను సహించబోమని స్పష్టంచేశారు.
సరిహద్దులో శాంతి, ప్రశాంతతను కాపాడటం తమ లక్ష్యం అని చెప్పారు. 1988 నుంచి ఇదే విధానం కంటిన్యూ చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే 1993, 1996 ఒప్పందం ప్రకారం గతేడాది యథాతథ స్థితిని మార్చడానికి చేసిన ప్రయత్నాలు సంబంధాలను ప్రభావితం చేశాయి. పరస్పర ప్రయోజనంతో ఇరుపక్షాలు మిగిలిన సమస్యకు సంబంధించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. తూర్పు లడాఖ్ ఎల్ఏసీ వెంట ఉన్న అసాధారణ సమస్యలపై కూడా చర్చలు జరిగాయని జై శంకర్ ట్వీట్ చేశారు.

నిమంత్రణ రేఖ వద్ద అపరిషృతంగా ఉన్న సమస్యలపైనే సమావేశంలో చర్చించినట్లు జై శంకర్ ఆ తర్వాత ట్వీట్ చేశారు. సరిహద్దుల వద్ద యథాతథ స్థితి యొక్క మార్పు ఆమోదయోగ్యం కాదని చైనా మంత్రికి చెప్పినట్లు జై శంకర్ చెప్పారు. సరిహద్దు ప్రాంతాలలో శాంతి మరియు ప్రశాంతత యొక్క పూర్తి పునరుద్ధరణ మరియు నిర్వహణ.. ఇరు దేశాల సంబంధాల అభివృద్ధికి అవసరమని జై శంకర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. సరిహద్దుల్లో అపరిషృత సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల సీనియర్ మిలటరీ కమాండర్ల మధ్య త్వరలో భేటీకి అంగీకరించినట్లు జై శంకర్ చెప్పారు.