వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: పార్లమెంట్ భవన్ లో రేప్

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ పార్లమెంట్ భవనంలో దారుణం జరిగింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

లండన్ పోలీసు అధికారుల కథనం మేరకు అక్టోబర్ 14వ తేదిన బ్రిటన్ పార్లమెంట్ భవనంలో మహిళను నిందితుడు రేప్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు.

అత్యాచార వ్యతిరేక చట్టాల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచారు. వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం 2017 జనవరికి కేసు వాయిదా వేసింది. నిందితుడిని బెయిల్ పై విడుదల చేసింది.

United Kingdom police probe rape allegation at houses of Parliament

అత్యాచారం చేసిన వ్యక్తి రాజకీయ నాయకుడు కాదని పోలీసులు చెప్పారు. కన్జర్వేటివ్ ఎంపీ తరపున పని చేస్తున్న వ్యక్తి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు స్పష్టం చేశారు.

ఆ ఎంపీ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. పార్లమెంట్ భవనంలో మహిళపై అత్యాచారం జరిగిన విషయంలో స్పందించడానికి కన్జర్వేటివ్ పార్టీ నిరాకరించింది. పార్లమెంట్ భవనంలో లైంగిక వేధింపులకు గురైన విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే అప్రమత్తం అయ్యామని, కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని హౌస్ ఆఫ్ కామర్స్ అధికార ప్రతినిధి తెలిపారు.

English summary
A 23-year-old man was arrested that same day on suspicion of rape. He has been bailed pending further enquires to a date in mid-January 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X