వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వం, దేశం, సమాజం కోసం శ్రమిస్తాం, మా స్వేదమే ప్రజల సౌఖ్యం: మోడీ

|
Google Oneindia TeluguNews

విశ్వశాంతి కోసం తాము పాటుపడతామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తమకు మూడు విధానాలు ముఖ్యమని పేర్కొన్నారు. సమస్త విశ్వం, దేశం, సమాజం కోసం భారతదేశం పాటుపడుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించారు. విశ్వ శాంతి కోసం కృషిచేస్తామని, అందరికీ దయభావంతో మెలుగుతామని పేర్కొన్నారు. ప్రజాహితమే తమ కర్తవ్యమని ఉద్ఘాటించారు. 130 కోట్ల మంది ప్రయోజనాల కోసం అహోరాత్రులు కష్టపడుతున్నామని తెలిపారు.

దేశాభవృద్ధి కోసం రాజీలేకుండా పోరాడుతామని చెప్పారు. దేశ హితం కోసం రాజీపడబోమని తేల్చిచెప్పారు. తమకు ప్రపంచంలో అన్ని దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. మంచి కోసం లోక కళ్యాణం జరుగుతుందని ప్రత్యేకంగా ప్రధాని మోడీ ప్రస్తావించారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత ఐక్యరాజ్యసమితి ఆవిర్భించదని మోడీ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి పాటుపడుతుందన్నారు.

 universe, country, society is our priority : modi

భారత్ శాంతి కాముక దేశమని, అలాగని తిరగబడితే చూస్తూ ఊరుకోబమని తేల్చిచెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారియిందని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మార్పు దీనికి నిదర్శమని చెప్పారు. ప్రపంచ దేశాలు పురోగమన దిశలో పయనిస్తున్నాయని చెప్పారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అందుకు శాంతి, సామరస్యం ముఖ్యమని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఇదే విషయాన్ని వివేకానంద అమెరికాలో చాలా చోట్ల చెప్పారని గుర్తుచేశారు.

English summary
universe, country, society is our priority : modi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X