భారత్ మా నమ్మకమైన మిత్రదేశం.. చైనాది స్వార్థబుద్ధి: రెక్స్ టిల్లర్సన్ సంచలన వ్యాఖ్యలు
ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో భారత్ మాత్రమే అమెరికాకు నమ్మకమైన మిత్ర దేశామని, చైనా కాదని అమెరికా విదేశాంగ కార్యదర్శి రెక్స్ టిల్లర్సన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కూడా
వాషింగ్టన్: ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో భారత్ మాత్రమే అమెరికాకు నమ్మకమైన మిత్ర దేశామని, చైనా కాదని అమెరికా విదేశాంగ కార్యదర్శి రెక్స్ టిల్లర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
చైనా స్వార్థబుద్ధితో మాత్రమే అమెరికాతో స్నేహం చేస్తుందని ఆయన ఆరోపించారు. బాధ్యత గల భారత్ వంటి దేశాలతో వ్యాపార సంబంధాలను కూడా మెరుగుపరుచుకుంటే రెండు దేశాలకు మేలు జరుగుతుందని టిల్లర్సన్ అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా మోడీ-ట్రంప్ భేటీని కూడా టిల్లర్సన్ ప్రస్తావించారు. అమెరికాలో భారత ప్రధానికి అపూర్వ స్వాగతం లభించిందని, ట్రంప్ మరే దేశాధినేతకు ఇవ్వని గౌరవాన్ని మోడీ పట్ల చూపారని టిల్లర్సన్ గుర్తుచేశారు.
చైనా దక్షిణ సముద్రంలో అమెరికా సార్వభౌమత్వాన్ని గౌరవించడం లేదని టిల్లర్సన్ విమర్శలు గుప్పించారు. చైనాతో సంబంధాలకు ఇది ప్రధాన అవరోధంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే ఇటు భారత్‌తో కూడా చైనాకు మంచి సంబంధాలు లేవని ఇటీవల డోక్లామ్ వివాదంతో ఇరు దేశాల మధ్య దూరం పెరిగిందన్నారు. అంతేకాదు, రాబోయే వారం రోజుల్లో తాను భారత్‌లో పర్యటించనున్నట్లు టిల్లర్సన్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications