సునితా విలియమ్స్ భర్త ఎవరు..? పిల్లలు పుట్టకపోవడం వెనుక..!
సునితా విలియమ్స్.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన ఆమె ఎట్టకేలకు భూమిపైకి అడుగుపెట్టారు. అయితే సాంకేతిక కారణాల వల్ల వల్ల ఆమె అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అసలు ఆమె భూమిపైకి తీసుకురాగలరా..? ఆమె ఆరోగ్యం ఎలా ఉంది..? అసలు ప్రాణాలతో ఆమె భూమిపైకి వస్తుందా..? ఇలా అనేక ప్రశ్నలు సామాన్య ప్రజలను సైతం వెంటాడాయి. కానీ అన్ని అవరోధాలను దాటి ఆమె మార్చి 19న భూమి పైకి అడుగు పెట్టారు.
సునితా విలియమ్స తన తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌తో కలిసి భూమండలానికి చేరుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు. భారత కాలమానం ప్రకారం మార్చి 19 బుధవారం తెల్లవారు జామున సరిగ్గా 3:27 నిమిషాలకు స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ క్రూ- 9.. ఫ్లోరిడాలో గల నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడి నుంచి వారిద్దరినీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. 45 రోజుల పాటు అక్కడే రిహాబిలిటేషన్‌లోనే వీళ్లు గడపనున్నారు.
సునితా భర్త ఎవరు..?
సునితా విలియమ్స్ తల్లిదండ్రులు దీపక్ పాండ్యా, ఉర్సూలిన్ బోన్నీ జాలోకర్. దీపక్ పాండ్యాది స్వస్థలం గుజరాత్ అయినా.. 70 ఏళ్ల క్రితమే ఈ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. ఇక సునితా విలియమ్స్ ఎప్పుడూ చదువులో ముందు ఉండేవారు. కొంతకాలం పాటు ఆమె అమెరికన్ నావికా దళంలో ఉద్యోగం చేశారు. డ్రైవింగ్ ఆఫీసర్ గా కొన్నాళ్లపాటు పనిచేశారు. ఆ తర్వాత అంతరిక్షంపై మక్కువతో వ్యోమగామి కావాలని నిర్ణయించుకున్నారు. 1998లో ఈమేరకు శిక్షణ కూడా తీసుకున్నారు.

అయితే సునితా విలియమ్స్ భర్త గురించి చాలా మందికి తెలీదు. ఆమె భర్త పేరు మైఖేల్ జే. విలియమ్స్. ప్రస్తుతం టెక్సాస్ లో ఫెడరల్ మార్షల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. 1987లో మేరీల్యాండ్ లోని నేవల్ ఎకాడమీలో శిక్షణ పొందే సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. వీరికి 20 ఏళ్ల క్రితమే వివాహం జరిగినా ఇప్పటికీ పిల్లలు లేరు. దీంతో పెంపుడు కుక్కలనే తమ పిల్లలుగా పెంచుకుంటున్నారు ఈ దంపతులు. వీరి ఇంట్లో మూడు శునకాలు ఉన్నాయి. వీటిని పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా పెంచుకుంటున్నారు.
పిల్లలు పుట్టకపోవడం వెనుక..
పిల్లలు లేకపోవడం గురించి కొన్నేళ్ల క్రితమే సునితా విలియమ్స్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "అందరిలాగే నాకూ తల్లిని కావాలని ఉంది. కానీ వ్యోమగామి అవ్వాలన్నది నా కల. పిల్లలు ఉంటే వారికోసం నా కెరీర్ వదులుకోవాల్సి వస్తుంది. వ్యోమగామిగా మారి ప్రపంచానికి దిక్సూచిగా మారాలని నేను నిర్ణయించుకున్నా. పిల్లలు లేరన్న బాధ అప్పుడప్పుడు వేధిస్తుంది. కానీ మేము పెంచుకుంటున్న కుక్క పిల్లలు ఆ లోటు తీరుస్తున్నాయి. " అని సునితా విలియమ్స్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications