వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: పగలు తగ్గింది, 2018లో పెను భూకంపాలు

2018లో ప్రపంచదేశాలను పెను భూకంపాలు అతలాకుతలం చేస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూ పరిభ్రమణంలో చోటు చేసుకున్న స్వల్ప మార్పులే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: 2018లో ప్రపంచదేశాలను పెను భూకంపాలు అతలాకుతలం చేస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూ పరిభ్రమణంలో చోటు చేసుకున్న స్వల్ప మార్పులే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

భూమి పరిభ్రమణంలో చోటు చేసుకొన్న మార్పులు మానవాళిపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. దీని కారణంగా రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రమాదాలు చోటుచేసుకొనే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఈ పరిణామాలు మానవాళికి తీవ్ర నష్టం కల్గించే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చిన్న మార్పులే అయినప్పటికీ దాని ద్వారా తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదంటున్నారు.

 2018లో పెను భూకంపాలు

2018లో పెను భూకంపాలు

భూ పరిభ్రమణంలో చోటు చేసుకున్న స్వల్ప మార్పుల కారణంగా 2018లో పెను భూకంపాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.మార్పులు చిన్నవే అయినా పరిణామాలు మాత్రం తీవ్రంగా, కనివీని ఎరుగనంతగా ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ముఖ్యంగా అధిక జనావాస ప్రాంతాలపై పెను విపత్తులు విరుచుకుపడాతాయని తెలిపారు.

 పగలు తగ్గిపోయింది.

పగలు తగ్గిపోయింది.

భూ పరిభ్రమణం నెమ్మదించడం వల్ల రోజులో పగటి సమయం ఒక్క మిల్లీ సెకండ్‌ పాటు తగ్గిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.చూడడానికి ఇది స్వల్ప మార్పుగానే కన్పిస్తోందన్నారు. అయితే దీని కారణంగా భూ అంతర్భాగంలో జరిగే పరిణామాలు పెను విపత్తును సృష్టిస్తాయంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ కొలరెడో ప్రొఫెసర్లు రోగర్‌ బిల్హమ్‌, బెండిక్‌లు.

2018లో 20కి పైగా భూకంపాలు

2018లో 20కి పైగా భూకంపాలు

2018 ఆరంభం నుంచి పెను భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు రోగర్‌ బిల్హమ్‌, బెండిక్‌లు హెచ్చరించారు. ఏడాది మొత్తంలో దాదాపు 20కుపైగా పెను భూకంపాలు సంభవిస్తాయని చెప్పారు. అయితే, పెను భూకంపాలు ఎందుకు ఉద్భవిస్తున్నాయన్న ప్రశ్నకు సరైన కారణాన్ని శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న జనావాస ప్రాంతాల కేంద్రంగా భూకంపాలు సంభవించే అవకాశాలున్నాయని ప్రకటించారు.

ఎక్కువ తీవ్రతతో భూకంపాలు

ఎక్కువ తీవ్రతతో భూకంపాలు

1900 సంవత్సరం నుంచి నేటి వరకూ భూకంప తీవ్రత 7.0 దాటిన వాటిపై తాము చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. గత 116 ఏళ్లలో కేవలం ఐదంటే ఐదే సమయాల్లో( ఐదు టైమ్‌ పిరియడ్‌లలో‌) భూకంపాలు సాధారణంగా కంటే ఎక్కువ సార్లు సంభవించాయని వెల్లడించారు.భూమి పరిభ్రమణానికి, భూకంపాలు రావడానికి మధ్య సంబంధాన్ని గత నెలలో రు. భూమి పరిభ్రమించడానికి, భూమి పొరలకు మధ్య బలమైన సంబంధం ఉందని వెల్లడించారు. భూ పరిభ్రమణంలో మార్పులు వస్తే భూమి పొరల్లో కూడా మార్పులు చోటు చేసుకుని విపరీతమైన పరిణామాలకు దారి తీస్తుందని తెలిపారు.

అణు గడియారాల ద్వారా గుర్తించొచ్చు

అణు గడియారాల ద్వారా గుర్తించొచ్చు

సాధారణ సమయాల్లో ప్రపంచ దేశాల పాలిట పెను విపత్తుగా మారిన భూకంపాల సంఖ్య సంవత్సరానికి 15గా ఉండగా.. తాము పేర్కొన్న ఐదు సమయాల్లో మాత్రం ఏడాదికి సంభవించిన పెను భూకంపాల సంఖ్య 25 నుంచి 30 వరకూ ఉన్నట్లు బిల్హమ్‌ గుర్తు చేశారు. భూమి పరిభ్రమణం నెమ్మదించడాన్ని అణు గడియారాల ద్వారా గుర్తించొచ్చని చెప్పారు.అలాంటి సమయమే ప్రస్తుతం (2013-2018ల మధ్య) జరుగుతోందని వెల్లడించారు. అదృష్టవశాత్తు గడచిన నాలుగేళ్లలో కేవలం ఆరు పెను భూకంపాలను మాత్రమే మనం చవిచూశామని చెప్పారు.

English summary
Scientists have warned there could be a big increase in numbers of devastating earthquakes around the world next year. They believe variations in the speed of Earth’s rotation could trigger intense seismic activity, particularly in heavily populated tropical regions.Although such fluctuations in rotation are small – changing the length of the day by a millisecond – they could still be implicated in the release of vast amounts of underground energy, it is argued.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X