పాక్‌కు యుద్ధవిమానాలిస్తే భారత్‌పైనే వేస్తారు: హక్కానీ
ఇస్లామాబాద్: ఉగ్రవాదులను నిలువరించేందుకు పాకిస్థాన్‌కు ఎటువంటి సాయం చేసినా, అది భారత్‌పై పోరుకే వాడుతారని అమెరికాలో పాకిస్థాన్ మాజీ దౌత్యాధికారి హుస్సేన్ హుక్కానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందించాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. ఆ విమానాలతో ఉగ్రవాదులతో పోరాడాల్సిన పాకిస్థాన్, దాన్ని పక్కనబెట్టి, వాటిని భారతదేశంపై ప్రయోగిస్తుందని ఆయన అన్నారు.

‘ఒబామా సర్కారు పాకిస్థాన్‌తో ఓ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని యోచిస్తోంది. కొద్ది నెలల క్రితం ఒక బిలియన్ డాలర్ల విలువైన యుద్ధ హెలికాప్టర్లను అందించే డీల్ కుదుర్చుకుంది. వీటితో దక్షిణాసియాలో అశాంతి పెరిగే ప్రమాదముంది' అని అన్నారు.
పాకిస్థాన్ తన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి వుందని, ఏ ఒక్క ఉగ్రమూలాన్నీ వదలకుండా తుదముట్టించేందుకు కట్టుబడాల్సి వుందని హక్కానీ అన్నారు. అలా జరుగకుంటే, అమెరికన్ ఆయుధాలు భారత్ వైపు దూసుకెళతాయని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications